ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాధారణ బియ్యం కంటే బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచివి.. ఎందుకంటే?

ABN, First Publish Date - 2021-10-01T19:16:32+05:30

చక్కటి సువాసన, రుచి కలిగినది బాస్మతి బియ్యం. బ్రౌన్‌ బాస్మతి, వైట్‌ బాస్మతి అనే రెండు రకాల్లో ఎక్కువగా లభిస్తుంది. బ్రౌన్‌ బాస్మతి బియ్యాన్ని తెల్లటి దానితో పోలిస్తే ఇందులో పీచుపదార్థం, వివిధ రకాల బీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(01-10-2021)

ప్రశ్న: బిరియాని (బాస్మతి) రైస్‌ కేవలం రుచి కోసమేనా లేదా అందులో ఏవైనా పోషక విలువలుంటాయా?


- అభిరామి, బెంగళూరు


డాక్టర్ సమాధానం: చక్కటి సువాసన, రుచి కలిగినది బాస్మతి బియ్యం. బ్రౌన్‌ బాస్మతి, వైట్‌ బాస్మతి అనే రెండు రకాల్లో ఎక్కువగా లభిస్తుంది. బ్రౌన్‌ బాస్మతి బియ్యాన్ని తెల్లటి దానితో పోలిస్తే ఇందులో పీచుపదార్థం, వివిధ రకాల బీ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పైగా ఈ బియ్యంలో పోషకాలు ఎక్కువే. గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ బ్రౌన్‌ బాస్మతి రైస్‌కు తక్కువ. తెల్ల బియ్యం కంటే తెల్ల బాస్మతి బియ్యానికి కూడా గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువే. మిగతా పోషక విలువలలో తెల్ల బియ్యానికి, తెల్లబాస్మతికి పెద్దగా తేడాలుండవు. మామూలు బ్రౌన్‌ రైస్‌ కంటే కూడా బ్రౌన్‌ బాస్మతి రైస్‌ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి రక్తంలో గ్లూకోజు నియంణ్రకు ఈ బాస్మతి బియ్యం మంచిది. అంతేకాకుండా సాధారణంగా మనం వినియోగించే బియ్యం రకాల కంటే మెరుగైనదని చెప్పవచ్చు. మిగిలిన పోషకాలు అన్ని రకాల బ్రౌన్‌ రైస్‌లలోనూ ఒకే విధంగా ఉంటాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-10-01T19:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising