ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్రాక్ష పళ్ల జ్యూస్‌ తాగుతున్నారా? అయితే..

ABN, First Publish Date - 2021-03-06T20:24:37+05:30

వందగ్రాముల ద్రాక్షలో కేవలం 80 కేలరీలు ఉంటాయి, విటమిన్‌ ’సి’, విటమిన్‌ ‘కె’పుష్కలంగా లభిస్తాయి. విటమిన్‌ ‘కె’ రక్తం గడ్డకట్టడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్‌ వంటి తీవ్రవ్యాధుల బారి నుంచి రక్షించుకొనేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-03-2021)

ప్రశ్న: మామూలు ద్రాక్ష, నల్ల ద్రాక్షల పోషక విలువల్లో ఏవైనా తేడాలున్నాయా?


- రామిరెడ్డి, నల్గొండ


డాక్టర్ సమాధానం: వందగ్రాముల ద్రాక్షలో కేవలం 80 కేలరీలు ఉంటాయి, విటమిన్‌ ’సి’, విటమిన్‌ ‘కె’పుష్కలంగా లభిస్తాయి. విటమిన్‌ ‘కె’ రక్తం గడ్డకట్టడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్‌ వంటి తీవ్రవ్యాధుల బారి నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్లు, ఇతర వృక్ష సంబంధ రసాయనాలు ద్రాక్షలో అధిక మొత్తంలో లభిస్తాయి. ఎర్రద్రాక్ష, నల్లద్రాక్షలో ఎక్కువగా లభించే రిజర్వేటాల్‌ అనే రసాయనం క్యాన్సర్‌ నుంచి ముఖ్యంగా పెద్ద ప్రేవుల క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్ల నుంచి రక్షించడంలో కీలకంగా పని చేస్తుంది. మామూలు ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లను ఫ్లేవనాయిడ్లు అంటారు. వీటికి కూడా ఎర్రద్రాక్షలో లభించే యాంటీఆక్సిడెంట్లకు దీటుగా పనిచేసే శక్తి ఉంది. భావోద్వేగాలను నియంత్రించడంలో, మెదడు పనితీరును ప్రభావితం చేయడంలో ఉపకరించే విటమిన్‌ ‘బి-6’ ద్రాక్షలో అధికం. కొన్ని ఇతర పళ్లతో పోల్చినపుడు ద్రాక్షలో చక్కెరలు ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ, ఇవి తక్కువ - మధ్యరకం గ్లైసీమిక్‌ ఇండెక్సు ఉన్న ఆహారపదార్థాలు. కాబట్టి ప్రమాదకరం కాదు. మధుమేహ రోగులు కూడా వీటిని తక్కువ మొత్తంలో తినవచ్చు. ద్రాక్ష అందించే ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందాలంటే వాటిని పళ్లుగానే తినడం మంచిది, చక్కెర కానీ, ఇతర తీపిపదార్థాలతో కానీ కలిపి జ్యూస్‌గా చేయడం వల్ల ప్రయోజనాలు నీరు కారిపోతాయి.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-03-06T20:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising