ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్‌నట్స్‌ తింటున్నారా?

ABN, First Publish Date - 2021-05-20T18:03:42+05:30

రోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడినా, పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ కోలుకునే సమయంలో బలవర్ధకమైన, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మరింత మెరుగ్గా కోలుకోగలుగుతాం. ఇందుకోసం వాల్‌నట్స్‌ తోడ్పడతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(20-05-2021)

కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడినా, పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ కోలుకునే సమయంలో బలవర్ధకమైన, పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మరింత మెరుగ్గా కోలుకోగలుగుతాం. ఇందుకోసం వాల్‌నట్స్‌ తోడ్పడతాయి.


పోషకాలు బోలెడు: వాల్‌నట్స్‌లో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్‌, సెలీనియం, ప్రొటీన్లు, విటమిన్‌ మొదలైన ఇమ్యూనిటీని పెంచే పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి కొవిడ్‌ రికవరీ డైట్‌ ప్లాన్‌లో వాల్‌నట్స్‌ను చేర్చుకోవాలి.


ఆరోగ్య ప్రయోజనాలు: వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కవ. వాల్‌నట్స్‌ పైపొరలో విటమిన్‌ ఇ, మెలటోనిన్‌, పాలీఫినాల్స్‌ ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, ఇన్‌ఫ్లమేషన్‌లతో పోరాడతాయి. వీటిని తినడం వల్ల మధుమేహం, అల్జీమర్స్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వాల్‌నట్స్‌తో జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.


నిల్వ ఇలా: వాల్‌నట్స్‌ను ఫ్రీజర్‌లో నిల్వ చేస్తే, ఏడాదిన్నర కాలం పాటు పాడవకుండా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో కొంటే, ఫ్రీజర్‌లో ఉంచి, స్వల్ప పరిమాణల్లో గాలి, వెలుగు సోకని ప్రదేశంలో డబ్బాలో నిల్వ ఉంచి, వాడుతూ ఉండాలి.


ఇలా వాడుకోవాలి: వాల్‌నట్స్‌ రుచి గొప్పగా ఉండకపోయినా, వాటిని వేర్వేరు రూపాల్లో వంటకాల్లో వాడుకోవాలి. పొడి చేసి కూరల్లో, సూప్స్‌లో కలుపుకోవచ్చు. వేయించి, సలాడ్స్‌తో కలిపి తినవచ్చు. ముక్కలుగా తరిగి కేక్స్‌పై చల్లుకుని తినవచ్చు. 


Updated Date - 2021-05-20T18:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising