ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్తహీనత పోవాలంటే...!

ABN, First Publish Date - 2021-04-05T19:23:31+05:30

రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు తీసుకునే ఆహారంపై కొంచెం శ్రద్ధ పెడితే సులువుగా ఈ సమస్య నుంచి బయటపడే వీలుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(05-04-2021)

రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు తీసుకునే ఆహారంపై కొంచెం శ్రద్ధ పెడితే సులువుగా ఈ సమస్య నుంచి బయటపడే వీలుంది. 


రక్తహీనత ఉన్న వారు ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శాకాహారులయితే సోయాబీన్స్‌, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. 

మాంసాహారులయితే రోజూ ఒక కోడిగుడ్డు తినాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ లభిస్తుంది. 

రక్తహీనత తగ్గాలంటే హీమోగ్లోబిన్‌ శాతం పెరగటంతో పాటు ప్రొటీన్‌, ఐరన్‌ శాతం పెరగాలి. ధాన్యాలు, రాగులు, గోధుమలలో ఐరన్‌ ఎక్కువగా లభిస్తుంది. ఆకుకూరల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 

ఆహారంలో చింతపండు బదులుగా నిమ్మకాయ, టొమాటో ఉపయోగించాలి. దీనివల్ల ఐరన్‌ గ్రహించే శక్తి పెరుగుతుంది. 

ఫ్రూట్స్‌ విషయానికొస్తే దానిమ్మ, పుచ్చకాయ బాగా ఉపయోగపడతాయి. డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు, బాదం తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. వీటితో పాటు పాలు తప్పకుండా తాగాలి. పాలు లేదా పెరుగు రూపంలో  తీసుకోవాలి. 

బెల్లం తింటే ఐరన్‌ లభిస్తుంది. కానీ శరీరం గ్రహించే శాతం తక్కువగా ఉంటుంది. అందుకే ఆహారంలో విటమిన్‌ సి కంటెంట్‌ ఉండేలా చూసుకుంటే ఐరన్‌ గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్య తొలగిపోతుంది.

Updated Date - 2021-04-05T19:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising