ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థైరాయిడ్‌ టెస్ట్‌ - ఏ పరీక్ష ఎందుకు?

ABN, First Publish Date - 2021-11-30T18:10:28+05:30

మహిళలకు వైద్యులు తరచుగా సూచించే పరీక్ష థైరాయిడ్‌ టెస్ట్‌. ఆ పరీక్ష ఎందుకో, ఎలాంటిదో, ఫలితాన్ని బట్టి ఏం తెలుస్తుందో తెలుసుకుందాం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(30-11-2021)

మహిళలకు వైద్యులు తరచుగా సూచించే పరీక్ష థైరాయిడ్‌ టెస్ట్‌. ఆ పరీక్ష ఎందుకో, ఎలాంటిదో, ఫలితాన్ని బట్టి ఏం తెలుస్తుందో తెలుసుకుందాం!


ఎ్‌సహెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌) టెస్ట్‌

ఏం చేస్తుంది: మెదడులోని పిట్యుటరీ గ్రంథి తయారుచేసే థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ను కొలుస్తుంది. 


ఏం తెలుస్తుంది: మెదడు ఈ హార్మోన్‌ను థైరాయిడ్‌ గ్రంథికి ఎక్కువ పరిమాణాల్లో పంపిస్తూ ఉంటే, ఆ విషయం తెలుస్తుంది.


ఎంత ఉండాలి: సాధారణ స్థాయి 0.35 - 5.00 మిల్లీ ఇంటర్నేషనల్‌ యూనిట్స్‌ పర్‌ లీటర్‌.


ఫ్రీ టి3

ఏం చేస్తుంది: శరీరంలో అందుబాటులో ఉన్న చురుకైన థైరాయిడ్‌ పరిమాణాన్ని కొలుస్తుంది.


ఏం తెలుస్తుంది: ఈ హార్మోన్‌ స్థాయి తక్కువగా ఉంటే, మన శరీరం అచేతనంగా ఉన్న ఈ హార్మోన్‌ను చురుగ్గా మార్చలేకపోతోందని అర్థం. 


ఎంత ఉండాలి: సాధారణ స్థాయి 2.3 - 4.2 పికోగ్రామ్స్‌ పర్‌ మిల్లీలీటర్‌


ఫ్రీ  టి4

ఏం చేస్తుంది: శరీరంలో అందుబాటులో ఉన్న అచేతన థైరాయిడ్‌ హార్మోన్‌ పరిమాణాన్ని కొలుస్తుంది. 


ఏం తెలుస్తుంది: టి4 తక్కువగా ఉంటే, చురుగ్గా ఉన్న హార్మోన్‌ తక్కువగా ఉందని అర్థం.


ఎంత ఉండాలి: 0.9 - 2.3 నానోగ్రామ్స్‌ పర్‌ డెసిలీటర్‌


రివర్స్‌ టి3

ఏం చేస్తుంది: నిల్వ ఉండిపోయిన లేదా నిద్రావస్థలో ఉన్న చురుకైన థైరాయిడ్‌ హార్మోన్‌ను కొలుస్తుంది. 


ఏం తెలుస్తుంది: ఈ హార్మోన్‌ పరిమాణం పెరుగుదల... ఒత్తిడి లేక శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుదలకు సూచన


ఎంత ఉండాలి: 10 - 24 నానోగ్రామ్స్‌ పర్‌ డెసిలీటర్‌


థైరాయిడ్‌ యాంటీబాడీస్‌

ఏం చేస్తుంది: వ్యాధినిరోధకశక్తి తయారుచేసే రెండు రకాల థైరాయిడ్‌ యాంటీబాడీల పరిమాణాలను కొలుస్తుంది.


ఏం తెలుస్తుంది: ఈ రెండు రకాల యాంటీబాడీలలో ఏ ఒక్కటి పెరిగినా అది ఆటోఇమ్యూన్‌ థైరాయిడ్‌ డిసీజ్‌ను సూచిస్తుంది.


ఎంత ఉండాలి: థైరాయిడ్‌ పెరాక్సిడేజ్‌ యాంటీబాడీలు 0 - 35 మిల్లీ ఇంటర్నేషన్‌ యూనిట్స్‌ పర్‌ లీటర్‌ ఉండాలి. థైరోగ్లోబ్యులిన్‌ యాంటీబాడీలు 0 - 0.4 మిల్లీ ఇంటర్నేషన్‌ యూనిట్స్‌ పర్‌ లీటర్‌ ఉండాలి.

Updated Date - 2021-11-30T18:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising