ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సప్లిమెంట్లు ఆచితూచి!

ABN, First Publish Date - 2021-07-15T18:03:00+05:30

ఆహారం ద్వారా పొందలేని పోషకాలను ఫుడ్‌ సప్లిమెంట్స్‌ ద్వారా భర్తీ చేసుకుంటూ ఉంటాం. టాబ్లెట్లు, పిల్స్‌, క్యాప్స్యూల్స్‌, పౌడర్ల రూపంలో ఉండే ఈ సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలు, అమైనోయాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు, ఎంజైమ్స్‌ పొందే వీలున్నా, వాటిని వైద్యుల సూచన మేరకే వాడుకోవడం అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(15-07-2021)

ఆహారం ద్వారా పొందలేని పోషకాలను ఫుడ్‌ సప్లిమెంట్స్‌ ద్వారా భర్తీ చేసుకుంటూ ఉంటాం. టాబ్లెట్లు, పిల్స్‌, క్యాప్స్యూల్స్‌, పౌడర్ల రూపంలో ఉండే ఈ సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలు, అమైనోయాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు, ఎంజైమ్స్‌ పొందే వీలున్నా, వాటిని వైద్యుల సూచన మేరకే వాడుకోవడం అవసరం.


ఎవరికి: సమతులాహారం తీసుకునే ఆరోగ్యవంతులకు సప్లిమెంట్ల అవసరం ఉండదు. అయితే గర్భం దాల్చే ప్రయత్నాల్లో ఉన్న మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 50 ఏళ్లు పైబడినవాళ్లు, పోషకలోపాలు కలిగినవాళ్లు, వ్యాధుల నుంచి కోలుకుంటున్నవారికి సప్లిమెంట్ల అవసరం ఉంటుంది.


అవసరం మేరకే: శరీరానికి రోజుకు అవసరమైన పోషకాల పరిమాణానికి తగ్గట్టు సమతులాహారం తీసుకోవడం అవసరం. అలాగే సప్లిమెంట్లు కూడా! శరీరంలో తగ్గిన పోషకాలను భర్తీ చేయగలిగే పరిమాణంలోనే సప్లిమెంట్లను తీసుకోవాలి. అదనంగా తీసుకున్నప్పుడు, శరీరం ఎక్కువైన పోషకాలను విసర్జిస్తుంది. కొన్ని సందర్భాల్లో అదనపు సప్లిమెంట్ల ఫలితంగా తలతిరుగుడు, పొట్టలో నొప్పి, జుట్టు రాలడం, నిస్సత్తువ వంటివి రావచ్చు. 


దుష్ప్రభావాలు: విటమిన్‌ కె సప్లిమెంటును సర్జరీకి ముందు తీసుకోవడం వల్ల రక్తం పలుచనయ్యే మందుల ప్రభావం తగ్గి, రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు తీసుకోవడం వల్ల కీమోథెరపీ ప్రభావం తగ్గుతుంది. ఎక్కువ పరిమాణంలో విటమిన్‌ బి సప్లిమెంట్‌ను ఏళ్లతరబడి వాడడం వల్ల నాడీ నష్టం జరుగుతుంది.

Updated Date - 2021-07-15T18:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising