ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవి సూపర్‌ డైట్‌లు

ABN, First Publish Date - 2021-03-15T18:21:50+05:30

ఎలాంటి డైట్‌ తీసుకోవాలి? ఏ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి? కరోనా తరువాత ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం పెరిగింది. ఇదే విషయంపై ఒక సర్వే జరిపితే మెడిటరేనియన్‌ డైట్‌ తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఆ తరువాత స్థానంలో డాష్‌ డైట్‌ నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(15-03-2021)

ఎలాంటి డైట్‌ తీసుకోవాలి? ఏ ఆహారంలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి? కరోనా తరువాత ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం పెరిగింది. ఇదే విషయంపై ఒక సర్వే జరిపితే మెడిటరేనియన్‌ డైట్‌ తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని తేలింది. ఆ తరువాత స్థానంలో డాష్‌ డైట్‌ నిలిచింది.


మెడిటరేనియన్‌ డైట్‌ ఇలా...

మెడిటరేనియన్‌ డైట్‌ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు పెరగరు. మధుమేహాన్ని నిరోధించవచ్చు. స్ట్రోక్‌ లాంటివి రాకుండా జాగ్రత్తపడొచ్చు. 

రోజూ పండ్లు, కూరగాయలు, ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్‌, ధాన్యాలు తీసుకోవాలి.

వారంలో రెండుసార్లు చేపలు, గుడ్లు, బీన్స్‌ తప్పనిసరిగా తినాలి. పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవాలి.

రెడ్‌మీట్‌ని మితంగా తినాలి. 

యాపిల్స్‌, అరటిపండ్లు, ద్రాక్ష, కమలాలు, ఖర్జూరాలు, అత్తిపండ్లు వంటివి తింటే మంచిది. బెర్రీ్‌సలో అయితే స్ట్రాబెర్రీస్‌, బ్లూబెర్రీస్‌, ఎండుద్రాక్షలు తినాలి.

బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, పిస్తాపప్పులు మితంగా తినాలి.

విత్తనాల్లో సన్‌ఫ్లవర్‌ విత్తనాలు, దోసగింజలు తింటే ఎంతో ఆరోగ్యం.

సీఫుడ్‌ కూడా చాలా మంచిది. నీరు బాగా ఉండే ట్యూనా, సాల్మాన్‌, ట్రౌట్‌, మకేరల్‌ చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది. నూనెలో వేగించిన చేపలను తినొద్దు. 


డాష్‌ డైట్‌ ఇలా...

రక్తపోటు తగ్గించుకోవడానికి ఈ డైట్‌ అత్యుత్తమం. 

పండ్లు, కూరగాయలు, తక్కువ ఫ్యాట్‌ ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవాలి.

కొలెస్ట్రాల్‌, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌, శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

చేపలు, పౌలీ్ట్ర ఉత్పత్తులు, నట్స్‌ తినాలి.

లంచ్‌, డిన్నర్‌లో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.

రోజూ ఫ్రూట్స్‌ని ఒకసారి స్నాక్‌గా తీసుకోవాలి.

ఉప్పులేని నట్స్‌ తినడం మంచిది.

తక్కువ ఫ్యాట్‌ ఉండేవి, అసలు ఫ్యాట్‌ లేని పెరుగు, ఉప్పు లేని ప్లెయిన్‌ పాప్‌కార్న్‌ వంటివి తినొచ్చు.


Updated Date - 2021-03-15T18:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising