ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్యూనిటీ దృఢంగా...

ABN, First Publish Date - 2021-05-05T16:56:08+05:30

కొవిడ్‌ నుంచి రక్షణ రోగనిరోధకశక్తితో కొంతమేరకు సాధ్యమే! ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఇమ్యూనిటీ దృఢంగా లేకపోతే కొవిడ్‌ బారిన పడతాం! కాబట్టి అందుకు తోడ్పడే ఆహార నియమాలు పాటించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నుంచి రక్షణ రోగనిరోధకశక్తితో కొంతమేరకు సాధ్యమే! ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఇమ్యూనిటీ దృఢంగా లేకపోతే కొవిడ్‌ బారిన పడతాం! కాబట్టి అందుకు తోడ్పడే ఆహార నియమాలు పాటించాలి. కొన్ని ఆహారపదార్థాలు పలు రకాల సూక్ష్మక్రిముల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. అవేంటంటే...


స్ట్రాబెర్రీ, బొప్పాయి, నారింజ మొదలైన విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే పళ్లు ఎక్కువగా తినాలి.

బాదం, వేరుసెనగ, పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్‌ ఇ కూడా రోగనిరోధకశక్తికి తోడ్పడుతుంది.

అవిసె గింజలు, నట్స్‌, చేపల్లో ఉండే ఒమేగా 3 యాసిడ్లు ఇమ్యూనిటీని  పెంచుతాయి.

మష్రూమ్స్‌లో బీటా గ్లూకాన్స్‌ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి వీటిని కూడా తరచుగా తింటూ ఉండాలి.


వ్యాయామం, నిద్ర

30 నిమిషాలకు తగ్గకుండా ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల రోగనిరోఽధకశక్తి బలపడుతుంది. వ్యాయామం వల్ల యాంటీబాడీలు, తెల్లరక్తకణాలు శరీరంలో వేగంగా కదులుతూ ఉంటాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ను క్షణాల్లో పసిగట్టి, సమర్థంగా పోరాడతాయి. దాంతో వ్యాధులతో ఆరోగ్యం కుంటుపడకుండా ఉంటుంది. అలాగే రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. కంటి నిండా నిద్ర ఒత్తిడిని తొలగించి, శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. 



Updated Date - 2021-05-05T16:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising