ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మామూలు పాలకు బదులుగా సోయా పాలను వాడొచ్చా?

ABN, First Publish Date - 2021-07-23T18:09:56+05:30

శాకాహారులకు అత్యుత్తమమైన ప్రొటీన్ల ఖజానా సోయా. ఆ సోయా గింజల నుండి తయారుచేసేవే సోయాపాలు. ఆవు లేదా గేదెపాలు పడని వారు, ఏవైనా కారణాల వల్ల అవి తాగేందుకు ఇష్టపడని వారు, వాటికి ప్రత్యామ్నాయంగా సోయాపాలను వాడవచ్చు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(23-07-2021)

ప్రశ్న: మామూలు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలను వాడొచ్చా? సోయాపాలలో ఎటువంటి పోషక విలువలుంటాయి?


- రాగిణి, మంచిర్యాల


డాక్టర్ సమాధానం: శాకాహారులకు అత్యుత్తమమైన ప్రొటీన్ల ఖజానా సోయా. ఆ సోయా గింజల నుండి తయారుచేసేవే సోయాపాలు. ఆవు లేదా గేదెపాలు పడని వారు, ఏవైనా కారణాల వల్ల అవి తాగేందుకు ఇష్టపడని వారు, వాటికి ప్రత్యామ్నాయంగా సోయాపాలను వాడవచ్చు. మామూలు పాలతో పోలిస్తే సోయాపాలలో కెలోరీలు తక్కువే. సోయాపాలలో కూడా మాములు పాలలానే ప్రొటీన్లు అధికం. దీనితో పాటు కొంచెం పిండి పదార్థాలు, పీచు పదార్థాలు కూడా సోయాపాలలో లభిస్తాయి. విటమిన్‌- కె, థయామిన్‌, ఫోలేట్‌ వంటి విటమిన్లు, మాలిబ్డినమ్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌ లాంటి ఖనిజ లవణాలు సోయాలో పుష్కలం. సోయాపాలలో అధికంగా ఉండే ఐసోఫేవన్స్‌ గుండె జబ్బులు, రొమ్ము కాన్సర్‌, ప్రోస్టేట్‌ కాన్సర్‌ మొదలైన వాటి నుండి రక్షణనిస్తాయి. సోయాబీన్స్‌ అంటే అలెర్జీలు ఉన్న వారు తప్ప మిగతా వారందరు వీటి పాలను తాగవచ్చు. అయితే మార్కెట్లో అధికంగా లభించే సోయాపాలలో రుచికోసం చక్కెర కలిపినవి ఉంటున్నాయి. అవి కాకుండా చక్కెర కలపని సోయాపాలని ఎంచుకుంటే ఆరోగ్యానికి మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutriful.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-07-23T18:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising