ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైడ్‌ ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే?

ABN, First Publish Date - 2021-06-01T14:46:43+05:30

వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే తాపత్రయంతో పాటు, వ్యాక్సిన్‌తో తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ పట్ల భయం కూడా అంతే సమానంగా ఉంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(1-06-2021)

వ్యాక్సిన్‌ వేయించుకోవాలనే తాపత్రయంతో పాటు, వ్యాక్సిన్‌తో తలెత్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ పట్ల భయం కూడా అంతే సమానంగా ఉంటోంది. అయితే ఆ లక్షణాల గురించి భయాలు వదిలించుకోవాలి. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కనిపించే లక్షణాల తీవ్రతను తేలికపాటి చిట్కాలతో తగ్గించుకునే వీలుంది. 


వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత కొందర్లో జ్వరం, ఒళ్లు నొప్పులు రెండు రోజుల పాటు వేధిస్తాయి. అయితే ఈ లక్షణాలు వ్యాక్సిన్‌తో శరీరంలో యాంటీబాడీలు తయారవుతున్నాయి అనడానికి సంకేతాలు మాత్రమే! అయితే తాత్కాలికంగా ఇబ్బందిపెట్టే ఈ అసౌకర్యాలకు భయపడి వ్యాక్సిన్లకు దూరం కాకూడదు. వీటిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించాలి.


నీళ్లు తాగాలి: నీళ్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు నెట్టేస్తాయి. కాబట్టి వ్యాక్సిన్‌తో శరీరంలో చోటు చేసుకున్న దుష్ప్రభావాలను వదిలించుకోవాలంటే వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత రెండు రోజుల పాటు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతో పాటు కొబ్బరినీళ్లు, పళ్లరసాలు కూడా తాగవచ్చు.


విశ్రాంతి: యాంటీబాడీలు తయారుచేయడానికి శరీర వ్యాధినిరోధక వ్యవస్థ ఎంతో శ్రమకు లోనవుతుంది. ఆ క్రమంలో తలనొప్పి, కీళ్లనొప్పులు, జ్వరం మొదలవుతాయి. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని అదనపు శ్రమకు గురి చేయకూడదు. వీలైతే వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత ఎక్కువ సమయం పాటు నిద్రపోవాలి. అలా వీలుపడకపోతే మనసును ప్రశాంతంగా ఉంచే ధ్యానం, యోగా సాధన చేయవచ్చు. ఒత్తిడి లేని శరీరంలో యాంటీబాడీలు వేగంగా తయారవుతాయి.


నొప్పి: ఇంజెక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి కూడా రెండు రోజుల పాటు వేధిస్తుంది. ఈ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఆ ప్రదేశంలో ఐస్‌ ప్యాక్‌ పెట్టుకోవాలి. ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కోసం పెయిన్‌ కిల్లర్‌ తీసుకోవాలి.



Updated Date - 2021-06-01T14:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising