ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవిలో సబ్జాతో చలువ!

ABN, First Publish Date - 2021-04-10T17:43:17+05:30

ఈ సీజన్‌లో ఎండ, వేడి గాలుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే పానీయాలు ఎక్కువగా తాగాలి. వేసవిలో అజీర్తి సమస్యలూ ఎక్కువే. కాబట్టి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పెంచే సబ్జా గింజలు ఈ కాలంలో తింటూ ఉండాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-04-2021)

ఈ సీజన్‌లో ఎండ, వేడి గాలుల నుంచి ఉపశమనాన్ని ఇచ్చే పానీయాలు ఎక్కువగా తాగాలి. వేసవిలో అజీర్తి సమస్యలూ ఎక్కువే. కాబట్టి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పెంచే సబ్జా గింజలు ఈ కాలంలో తింటూ ఉండాలి.


సబ్జా గింజలు ఒంట్లోని విషపదార్థాలను తొలగిస్తాయి. తలనొప్పి, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి బయటపడేందుకు సబ్జా గింజలు తోడ్పడతాయి.

కొవ్వులను కరిగించడంలో సాయపడే అల్ఫా లిపోయిక్‌ ఆమ్లం సబ్జాలో ఎక్కువ.  పీచుపదార్థం ఉన్న ఈ గింజలను తింటే తొందరగా ఆకలి వేయదు. దాంతో సబ్జా నీళ్లు తాగితే తొందరగా బరువు తగ్గుతారు.


ఎలా తినాలంటే

సజ్జా గింజలను నీళ్లలో గంట పాటు నానబెట్టాలి. తరువాత వీటిని పెరుగు, మజ్జిగ, షర్బత్‌, మిల్క్‌షేక్‌లో వేసుకొని తాగితే సరి. లేదంటే నానబెట్టిన సబ్జా గింజలను గ్లాసు నీళ్లలో వేసి కొద్దిగా చక్కెర, ఉప్పు కలిపి కూడా తాగొచ్చు. 


సబ్జా షికంజీ షెర్బత్‌

ఒక పెద్ద గాజు జార్‌లో కొన్ని ఐస్‌ముక్కలు వేయాలి. తరువాత కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, నానబెట్టిన సబ్జా గింజలు, నీళ్లు పోసి బాగా కలపాలి. మిగిలిపోయిన పెరుగు నీళ్లు పోసి మళ్లీ కలపాలి. అంతే చల్లని సబ్జా షికంజీ షెర్బత్‌ రెడీ. 

Updated Date - 2021-04-10T17:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising