ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిట్‌నెస్ ప్రియులకు ఇంట్లోనే ప్రొటీన్‌ పౌడర్‌

ABN, First Publish Date - 2021-12-12T17:44:23+05:30

ఫిట్‌నెస్‌ ప్రియులకు ప్రొటీన్‌ పౌడర్ల విలువేంటో తెలుసు. అయితే మార్కెట్లో వేల రూపాయల ఖరీదైన ప్రొటీన్‌ పౌడర్లను కొనే బదులు, తక్కువ ఖర్చుతో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(12-12-2021)

ఫిట్‌నెస్‌ ప్రియులకు ప్రొటీన్‌ పౌడర్ల విలువేంటో తెలుసు. అయితే మార్కెట్లో వేల రూపాయల ఖరీదైన ప్రొటీన్‌ పౌడర్లను కొనే బదులు, తక్కువ ఖర్చుతో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం!


కావలసిన పదార్థాలు: బాదం: 1 కప్పు, వాల్‌నట్‌: అర కప్పు, పిస్తా: పావు కప్పు, జీడిపప్పు: పావు కప్పు, గుమ్మడి విత్తనాలు: 2 టేబుల్‌ స్పూన్లు, పుచ్చ విత్తనాలు: 2 టేబుల్‌ టీస్పూన్లు, పొద్దు తిరుగుడు విత్తనాలు: 2 టేబుల్‌ స్పూన్లు, ఓట్స్‌: అర కప్పు, షియా విత్తనాలు: 2 టేబుల్‌స్పూన్లు, పాల పొడి: అర కప్పు (తీపి లేనిది)


తయారీ విధానం: బాదం పప్పును చిన్న మంట మీద కమ్మని వాసన వచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో పిస్తా, వాల్‌నట్‌, జీడిపప్పు కలిపి వేయించి, పక్కన పెట్టుకోవాలి. గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు విత్తనాలు వేసి, సువాసన వచ్చే వరకూ వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఓట్లను కూడా కరకరలాడే వరకూ వేయించి తీయాలి. వేయించుకున్న వాటికి షియా విత్తనాలు జోడించి, అన్నీ కలిసేవరకూ తిప్పుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత, మిక్సీలో వేసి మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. వీటి నుంచి నూనె వెలువడకుండా పల్స్‌, బ్లెండ్‌ మోడ్‌లను మారుస్తూ ఉండాలి. ఈ పొడిని జల్లించుకుని, పాల పొడి కలుపుకుంటే ప్రొటీన్‌ పౌడర్‌ తయారైనట్టే! ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుని, రెండు నెలల లోపు వాడుకోవాలి. ప్రొటీన్‌ మిల్క్‌ కోసం రెండు కప్పుల పాలను వేడి చేసి, తయారుచేసి పెట్టుకున్న ప్రొటీన్‌ పౌడర్‌ 3 స్పూన్లను వేసి, బాగా కలుపుకోవాలి.

Updated Date - 2021-12-12T17:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising