ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాదం పొడిలో తేనె, నిమ్మరసం, పాలు కలిపి ఇలా చేస్తే ముఖం నిగనిగలాడుతుంది...

ABN, First Publish Date - 2021-12-27T18:31:23+05:30

చర్మం నిగారింపు సంతరించుకోవాలంటే మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వాడాల్సిన పనిలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(27-12-2021)

చర్మం నిగారింపు సంతరించుకోవాలంటే మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వాడాల్సిన పనిలేదు. ఇంట్లో లభించే పసుపు, శనగపిండి, పాలు, తేనె వంటి వాటితో ముఖారవిందాన్ని పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే....


ఒక కప్పు శనగపిండి తీసుకుని అందులో ఒక అర టీస్పూన్‌ పసుపు వేసి, కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి కలిపి పేస్టులా తయారుచేసుకోవాలి. కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ కలిపితే మరీ మంచిది. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. బాగా ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. 


తేనె కూడా చర్మ నిగారింపును పెంచుతుంది. ముందుగా ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత తేనెను అప్లై చేసి మర్దన చేసుకోవాలి. కాసేపు వదిలేస్తే చర్మం తేనెను గ్రహిస్తుంది. కాసేపయ్యాక గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.


నాలుగైదు బాదం పలుకులను పొడిగా చేసి అందులో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, రెండు చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాలు పోసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

Updated Date - 2021-12-27T18:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising