ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోషకాల గని అవకాడో..

ABN, First Publish Date - 2021-05-20T18:40:34+05:30

అవొకడో పండులో ఇరవైఐదు రకాల పోషకాలు లభిస్తాయి. చర్మసంరక్షణలోనూ ఈ పండు ఉపయోగపడుతుంది. ఆ విశేషాలు ఇవి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(20-05-2021)

అవొకడో పండులో ఇరవైఐదు రకాల పోషకాలు లభిస్తాయి. చర్మసంరక్షణలోనూ ఈ పండు ఉపయోగపడుతుంది. ఆ విశేషాలు ఇవి... 


‘అవొకడో’లో విటమిన్‌ ఎ, బి, సి, ఇ, కె. ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలున్నాయి. అంతేకాకుండా ఫైబర్‌, ప్రొటీన్‌, బీటా-సైటోస్టెరాల్‌, గ్లూటథయోన్‌, ల్యూటెన్‌ వంటి ఫైటోకెమికల్స్‌ ఉన్నాయి. 

విటమిన్‌ బి6, ఫోలికాసిడ్‌ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి హోమోసిస్టిన్‌ స్థాయిలను నియంత్రిస్తాుయి. ఒకవేళ వీటి లెవెల్స్‌ పెరిగితే గుండె జబ్బులకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్‌ ఇ, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

అవొకడోలో ఉండే కెరొటినాయిడ్‌ ల్యూటిన్‌ క ళ్లను కాపాడుతుంది. వయసు పైబడటం వల్ల వచ్చే కాటరాక్ట్‌ సమస్యలను దరిచేరకుండా చూస్తుంది.

బరువు పెరగాలనుకునే వారికి అవొకడో మంచి ఆప్షన్‌. ఇందులో హెల్దీ క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగడానికి ఇవి బాగా దోహదపడతాయి. 

ఈ ఫ్రూట్‌లో ఫోలేట్‌ అత్యధికంగా ఉంటుంది. స్ర్టోక్‌ రిస్క్‌ను ఫోలేట్‌ బాగా తగ్గిస్తుందని పరిశోధనల్లో రుజువయింది.

డ్రైస్కిన్‌తో బాధపడుతున్నట్లయితే అవొకడో జ్యూస్‌ను రోజూ తీసుకోవాలి. జ్యూస్‌ తాగడం ఇష్టం లేకపోతే అవొకడో ఆయిల్‌ను శరీరానికి పట్టించాలి. ఈ నూనెను మీ శరీరం బాగా గ్రహిస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.

అవొకడోను మెత్తగా నూరి తేనె, పెరుగు కలిపి ముఖానికి ఫేస్‌మాస్క్‌ వేసుకుంటే మృతకణాలన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

అవొకడోను మెత్తగా పేస్ట్‌ మాదిరిగా చేసి, దానికి కోడిగుడ్డు తెల్లసొన, ఒక టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తలకు పట్టి ంచాలి. అరగంట తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల శిరోజాలు మెరుస్తాయి.

అవొకడో గుజ్జును మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. అవొకడో గుజ్జుతో ముఖాన్ని రబ్‌ చేసి కొన్ని నిమిషాల పాటు వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.

Updated Date - 2021-05-20T18:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising