ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందానికి ముల్తానీ..!

ABN, First Publish Date - 2021-03-06T19:41:54+05:30

ఎండలో బాగా తిరిగివచ్చాక ముఖం కమిలిపోయినట్టుగా, నల్లగా అవుతుంది. అలాంటప్పుడు ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్‌ పోసి ఫేస్‌ మాస్కులా వేసుకుంటే ఫలితం ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-03-2021)

ఎండలో బాగా తిరిగివచ్చాక ముఖం కమిలిపోయినట్టుగా, నల్లగా అవుతుంది. అలాంటప్పుడు ముల్తానీ మట్టిలో రోజ్‌వాటర్‌ పోసి ఫేస్‌ మాస్కులా వేసుకుంటే ఫలితం ఉంటుంది.

ముల్తానీ మట్టిలో చెంచా చొప్పున తులసిపొడి, గంధంపొడి వేసి, తగినన్ని పచ్చిపాలు పోసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును రోజూ రాత్రిపూట ముఖానికి   రాసుకొని కాసేపటి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమల తాలుకు మచ్చలు పోయి చర్మం నిగారింపును పొందుతుంది.  

అరకప్పు ముల్తానీ మట్టి, కోడిగుడ్డు తెల్లసొన, ఒక చెంచా ఓట్స్‌, రెండు చెంచాల టొమాటో గుజ్జును ఒక గిన్నెలో వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పూసుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖానికి బాదం నూనె రాసుకుంటే ముఖం నిగ నిగలాడుతుంది. 

ముల్తానీ మట్టిలో చెంచా బాదం నూనె, చెంచా తేనె, అరచెంచా మీగడ, రోజ్‌వాటర్‌ కలిపి ఆ మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకొని పూర్తిగా పొడిబారక ముందే చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.


Updated Date - 2021-03-06T19:41:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising