ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదాల పగుళ్లు పోతాయిలా!

ABN, First Publish Date - 2021-04-03T17:01:43+05:30

సుతి మెత్తగా ఉండాల్సిన పాదాలు పగుళ్లతో బాధిస్తున్నాయా! ఇంటివద్దనే పాదాలకు సాంత్వన నిచ్చి, పగుళ్లను మాయం చేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-04-2021)

సుతి మెత్తగా ఉండాల్సిన పాదాలు పగుళ్లతో బాధిస్తున్నాయా! ఇంటివద్దనే పాదాలకు సాంత్వన నిచ్చి, పగుళ్లను మాయం చేయవచ్చు. అందుకు ఏం చేయాలంటే...


నోటి శుభ్రత కోసం ఉపయోగించే మౌత్‌వాష్‌ పొడి చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్‌లో ఒక వంతు మౌత్‌వాష్‌, రెండు వంతుల నీళ్లు వేసి అందులో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. తరువాత నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.


యాంటీమైక్రోబియల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలున్న తేనె పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పాదాలు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. 


పొడిచర్మానికి కొబ్బరినూనె తేమను అందించి తాజాగా మారుస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గుతుంది. 


 ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా పాదాలు పగుళ్లు బారుతాయి. అప్పుడు వెనిగర్‌ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే పగుళ్లు తగ్గిపోతాయి.


 పగుళ్లిచ్చిన పాదాలకు ఓట్‌మీల్‌, పాల మిశ్రమం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.


Updated Date - 2021-04-03T17:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising