ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ప్రాణాయామాలు వద్దు!

ABN, First Publish Date - 2021-06-02T16:55:27+05:30

కొవిడ్‌ పాండమిక్‌ మొదలైనప్పటి నుంచి ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద ధ్యాస పెరిగింది. వాటిని బలపరిచే వ్యాయామాల పట్ల ఆసక్తి కూడా పెరిగింది. కాబట్టే కొవిడ్‌ సోకక మునుపు శ్వాసకోశాలను క్లియర్‌గా ఉంచుకోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ పాండమిక్‌ మొదలైనప్పటి నుంచి ఊపిరితిత్తుల ఆరోగ్యం మీద ధ్యాస పెరిగింది. వాటిని బలపరిచే వ్యాయామాల పట్ల ఆసక్తి కూడా పెరిగింది. కాబట్టే కొవిడ్‌ సోకక మునుపు శ్వాసకోశాలను క్లియర్‌గా ఉంచుకోవడం కోసం, కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న సమయంలో ఊపిరితిత్తులు పూర్వపు సామర్ధ్యాన్ని పుంజుకోవడం కోసం కొన్ని వ్యాయామాలను ఆశ్రయిస్తున్నాం. అయితే వాటిలో కొన్ని వ్యాయామాలు ఊపిరితిత్తులను బలపరచకపోగా, వాటిని మరింత బలహీనపరిచే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఆ వ్యాయామాలు ఏవంటే... 


కపాలభాతి 

కపాలం అంటే పుర్రె, భాతి అంటే మెరుపు అని అర్థం. శ్వాస వ్యాయామాలతో శరీరంలో ఉష్ణం జనించి, టాక్సిన్ల విసర్జనకు దోహదం చేస్తుంది. మెటబాలిజంను పెంచి, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఈ యోగాభ్యాసంతో అంతర్గత అవయవాల మీద ఒత్తిడి పడుతుంది. గుండె జబ్బులు, ఆస్తమా, ఇతరత్రా శ్వాసపరమైన సమస్యలు ఉన్నవాళ్లు ఈ యోగాభ్యాసం చేయకూడదు. కొవిడ్‌తో బాధపడుతూ కపాలభాతి చేస్తే, ఊపిరి అందకపోగా, తలతిరుగుడు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే అధిక రక్తపోటు, అల్సర్‌ ఉన్నవాళ్లు కూడా కపాలభాతి చేయకూడదు.


మూర్ఛ ప్రాణాయామం

మూర్ఛ అంటే స్పృహ కోల్పోవడం అని అర్ధం. దీన్ని సాధన చేసేటప్పుడు ఊపిరి నెమ్మదిగా పీల్చుకుని కొన్ని క్షణాల పాటు బిగబట్టి ఉంచాలి. అలా ఊపిరి బిగబట్టి ఉంచే సమయాన్ని క్రమేపీ పెంచుకుంటూ పోవాలి. మూర్ఛ ప్రాణాయామం అనే అభ్యాసంలో దీన్నే పోలిన మరింత క్లిష్టమైన విధానం సాధన చేయవలసి ఉంటుంది. అయితే కొవిడ్‌తో కుదేలైన ఊపిరితిత్తులతో శ్వాస పీల్చుకోవడమే క్లిష్టంగా మారిన పరిస్థితిలో మూర్ఛ ప్రాణాయామం సాధన చేయకూడదు. దీని వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది.


భస్త్రిక ప్రాణాయామం

కపాలభాతిని పోలిన భస్ర్తిక నిజానికి పూర్తి భిన్నమైనది. శ్వాసను వేగంగా పీల్చి వదిలే భస్త్రిక వల్ల శరీరంలో ఉష్ణం జనించి, ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కొంతసేపు భస్త్రిక చేస్తే, ఊపిరి ఆడని పరిస్థితికి లోనవుతారు. కాబట్టి కొవిడ్‌ బాధితులు ఎటువంటి పరిస్థితిలోనూ ఈ ప్రాణాయామం సాధన చేయకూడదు.


Updated Date - 2021-06-02T16:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising