ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసం, సాంబార్‌ లాంటి వాటిల్లో మసాలా పొడులు వాడుతున్నారా? అయితే వెంటనే ఇది తెలుసుకోండి..

ABN, First Publish Date - 2021-11-12T18:39:13+05:30

సాధారణంగా ఇంట్లో తయారు చేసుకొనే రసం, సాంబారు పొడులలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క మొదలైన సుగంధ ద్రవ్యాలు వాడతాం. ఇవన్నీ కూడా తగు మోతాదుల్లో తీసుకొంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(12-11-2021)

ప్రశ్న: రసం, సాంబార్‌ లాంటి వాటిల్లో రుచికోసం మసాలా పొడులు వాడడం ఆరోగ్యానికి మంచిదేనా?


- రామినాయుడు, విజయనగరం


డాక్టర్ సమాధానం: సాధారణంగా ఇంట్లో తయారు చేసుకొనే రసం, సాంబారు పొడులలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క మొదలైన సుగంధ ద్రవ్యాలు వాడతాం. ఇవన్నీ కూడా తగు మోతాదుల్లో తీసుకొంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రణలో ఉంచి తరచూ వ్యాధుల పాలవకుండా ఉండేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండడానికి ఉపయోగపడతాయి. వీటిలోని పాలీఫీనాల్స్‌ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి లాభదాయకం. ఏవైనా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉంటే తప్ప మసాలా దినుసులన్నీ మంచివే. ఇంట్లో నాణ్యత కలిగిన దినుసులతో చేసుకునే మసాలాలతో ప్రయోజనం ఎక్కువ. గుర్తింపు కలిగిన బ్రాండ్ల మసాలా పొడులు కూడా నాణ్యంగానే ఉంటాయి కానీ కొన్ని నాసిరకాల మసాలాలు రంగులు, రసాయనాలతో కల్తీ చేసే అవకాశం ఉంది. వీటితో అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.


డాక్టర్ లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-11-12T18:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising