ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐబిఎస్‌ అంతు చూడాలంటే?

ABN, First Publish Date - 2021-12-14T21:06:14+05:30

జీవనశైలిని అస్తవ్యస్థం చేసే రుగ్మతల్లో ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ ఒకటి. ఈ ఆరోగ్య సమస్యను ప్రేరేపించే కారణాలను కనిపెట్టి, తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(14-12-2021)

జీవనశైలిని అస్తవ్యస్థం చేసే రుగ్మతల్లో ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ ఒకటి. ఈ ఆరోగ్య సమస్యను ప్రేరేపించే కారణాలను కనిపెట్టి, తగిన జాగ్రత్తలు పాటించడం అవసరం. 


లక్షణాలు ఇవే!


డయేరియా లేదా మలబద్ధకం


కడుపులో కదలికలు నొప్పితో కూడుకుని ఉండడం


కడుపు ఉబ్బరం


జీర్ణం కాని పదార్థాలతో కూడిన మలవిసర్జన


కడుపులో శబ్దాలు


మలవిసర్జన తదనంతరం ఉపశమనం కలగడం


వాంతి అవుతుందనే భావన


ఆందోళన


మలవిసర్జన తర్వాత, ఇంకా మిగిలిపోయి ఉందని అనిపించడం 


ఆకలి లేకపోవడం


కండరాలు, ఎముకల నొప్పులు


తరచుగా/అత్యవసరంగా మూత్రవిసర్జన చేయవలసి రావడం


ఏం చేయాలి?


అవకాడొ, కొవ్వుతో కూడిన చేపలు.


కొబ్బరి, పీచుతో కూడిన పళ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.


క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, రోజుకు 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి.


జీర్ణసంబంధ యాసిడ్లు.. మాలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం లేదా ప్రొబయాటిక్స్‌ తీసుకోవాలి. 


పాలిష్‌ పట్టని ధాన్యాలు తినాలి.


ఫడ్‌ డైరీ రాసుకోవాలి.


ప్రొబయాటిక్స్‌ తీసుకోవడం ఆపి, మార్పును గమనించాలి.


ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. 


ప్రేరేపించే అంశాలు


తీవ్రమైన ఒత్తిడి


మానసిక కుంగుబాటు


వేర్వేరు యాంటీబయాటిక్‌ మందులు, ఇతరత్రా మందులు వాడతూ ఉండడం


హార్మోన్లలో హెచ్చుతగ్గులు


ఆందోళన


తీవ్ర ఇన్‌ఫెక్షన్లు


పేగుల్లో వాతావరణం దెబ్బతినడం


వ్యాధినిరోధకశక్తి పనితీరు అస్తవ్యస్తమవడం


ఏం చేయకూడదు?


ఒత్తిడి తగ్గించుకోవాలి. 


చక్కెర, కెఫీన్‌ లాంటి ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే పదార్థాలు తగ్గించాలి. 


బ్రొకొలి, బీన్స్‌, పాల ఉత్పత్తులు తగ్గించాలి. 


భోజనం మానేయకూడదు


వేగంగా తినకూడదు


కొవ్వులు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినకూడదు


రోజుకి మూడు కప్పులకు మించి కాఫీ, టీలు తాగకూడదు


మద్యపానం మానేయాలి


వాయువులను పుట్టించే పదార్థాలకు దూరంగా ఉండాలి.


శీతల పానీయాలు తగ్గించాలి


రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోకూడదు


రాత్రి 8 గంటల తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదు


తిన్న వెంటనే పడుకోకూడదు.


Updated Date - 2021-12-14T21:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising