ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శరీరంలో ఐరన్‌ లోపిస్తే ఏమవుతుందంటే..?

ABN, First Publish Date - 2021-11-10T18:21:47+05:30

శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడంలో పోషకాలు, లవణాల పాత్ర కీలకం. ముఖ్యంగా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను కణాలకు సరఫరా చేయడంలో ఐరన్‌ కీలకమైనది. సరైన స్థాయిలో ఐరన్‌ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-11-2021)

శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడంలో పోషకాలు, లవణాల పాత్ర కీలకం. ముఖ్యంగా ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను కణాలకు సరఫరా చేయడంలో ఐరన్‌ కీలకమైనది. సరైన స్థాయిలో ఐరన్‌ ఉంటే రోగనిరోధక వ్యవస్థ బాగుంటుంది. 


ఐరన్‌ లోపిస్తే కణాలకు, కండరాలకు అందే ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంది. ఫలితంగా త్వరగా అలసిపోతారు. 


హీమోగ్లోబిన్‌ తయారీలో ఐరన్‌ ఉపయోగపడుతుంది. ఆక్సిజన్‌ రవాణాకు ఇది అవసరం. ఐరన్‌ లోపిస్తే ఈ రెండు తగ్గిపోతాయి. ఫలితంగా బ్రీతింగ్‌ రేటు పెరిగిపోతుంది. మెట్లు ఎక్కినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు త్వరగా అలసిపోతారు.


శరీరానికి సరిపడా ఆక్సిజన్‌ను పంప్‌ చేయడానికి గుండె ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. ఇది హృదయ స్పందనల్లో తేడాకు దారి తీస్తుంది. 


మెదడుకు అందే ఆక్సిజన్‌ శాతం తగ్గడం వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


నోరు పొడిబారిపోవడం, మంటలు, నోట్లో ఎర్రటి పగుళ్లు, అల్సర్లు వంటి లక్షణాలు కూడా ఐరన్‌ లోపాన్ని సూచిస్తాయి.

Updated Date - 2021-11-10T18:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising