ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు నల్లగా మారాలంటే ఇంట్లోనే ఇది ట్రై చేయండి..

ABN, First Publish Date - 2021-11-01T18:45:51+05:30

జుట్టుకు రంగు వేయడం ఈమధ్య కామన్‌ అయిపోయింది. కానీ రసాయనాలు ఉన్న రంగులకు బదులుగా హెన్నాతో కూడా జుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. అయితే హెన్నా తయారీలో ఈ పదార్థాలు తప్పక కలపాలి. అవి ఏమిటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(01-11-2021)

జుట్టుకు రంగు వేయడం ఈమధ్య కామన్‌ అయిపోయింది. కానీ రసాయనాలు ఉన్న రంగులకు బదులుగా హెన్నాతో కూడా జుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. అయితే హెన్నా తయారీలో ఈ పదార్థాలు తప్పక కలపాలి. అవి ఏమిటంటే...


ఒక ప్యాకెట్‌ హెన్నాలో కొద్దిగా బ్లాక్‌టీ, కోడిగుడ్డు పచ్చసొన, ఒక టీస్పూన్‌ నిమ్మరసం వేసి కలపాలి. తరువాత ఒక టీ స్పూన్‌ కాఫీ పౌడర్‌, ఒక టీస్పూన్‌ ఉసిరికాయ పొడి వేసి బాగా కలియబెట్టాలి. 


ఈ మిశ్రమాన్ని రాత్రి సిద్ధం చేసి పెట్టుకోవాలి.


ఉదయాన్నే హెన్నా మిశ్రమాన్ని తలకు పట్టించాలి. రెండు గంటల పాటు అలా వదిలేసి తరువాత స్నానం చేయాలి. 


ఆ రోజు షాంపూ ఉపయోగించకూడదు. మరుసటి రోజు షాంపూతో స్నానం చేయవచ్చు. 


కోడిగుడ్డు కలపడం ఇష్టం లేని వారు ఒక టేబుల్‌స్పూన్‌ పెరుగు కలిపినా సరిపోతుంది. జుట్టుకు రంగు వేయాల్సిన అవసరం లేకుండా సహజసిద్ధంగా నలుపు రంగులోకి మారుతుంది. నెలకోసారి హెన్నా ఉపయోగిస్తే చాలు.

Updated Date - 2021-11-01T18:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising