ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇమ్యూనిటీ డైట్‌!

ABN, First Publish Date - 2021-05-27T15:00:21+05:30

ఇమ్యూనిటీ డైట్‌ పైన దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఇమ్యూనిటీ డైట్‌ అనగానే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది అనుకోవడం పొరపాటే. మెనూలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(27-05-2021)

ఇమ్యూనిటీ డైట్‌ పైన దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఇమ్యూనిటీ డైట్‌ అనగానే ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది అనుకోవడం పొరపాటే. మెనూలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు.


ప్రతిరోజు ఒక గ్లాసు పాలు లేదా ఫ్రూట్‌ జ్యూస్‌ తీసుకోవడం ద్వారా తగినంత ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ లభిస్తాయి. 

డైరీ ఉత్పత్తులు ఎక్కువగా తినాలి. పాలు, పెరుగు, వెన్న తీసుకోవాలి. 

వారంలో రెండు రోజులు ఆకుకూరలు తప్పనిసరి. రోజూ ఒక ఆరెంజ్‌ తినాలి. ఆరెంజ్‌లో ఫోలిక్‌యాసిడ్‌ సమృద్ధిగా లభిస్తుంది. 

బాదం, ఖర్జూర, పాలకూర, లివర్‌లో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది.

శరీరం ఐరన్‌ను గ్రహించటానికి విటమిన్‌ సి సహాయపడుతుంది. కాబట్టి సి విటమిన్‌ సమృద్ధిగా లభించే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్‌లో యాంటీ అక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. పీనట్స్‌, వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ, విటమిన్‌ బి లభిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి.

మాంసాహారంలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. శాకాహారులైతే ధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవాలి. 

అల్లం, పసుపు, వెల్లుల్లి... వీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఆర్థరైటి్‌సను తగ్గించడానికి అల్లం ఉపకరిస్తుంది. పసుపులో యాంటీ అక్సిడెంట్లు ఉంటాయి. 

సోయా ప్రోటీన్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. ఎముకలు, గుండె ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. సాల్మన్‌, ట్యూనా చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా లభిస్తాయి. 

మాంసాహారం, చేపలు, కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, ధాన్యాలలో విటమిన్‌ బి12 ఉంటుంది. 

శరీరం డీహై డ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఇందులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. 

స్నాక్స్‌కి బదులుగా నట్స్‌ తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకొంటే శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. 

Updated Date - 2021-05-27T15:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising