ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సీమీటర్‌ ఇలా...

ABN, First Publish Date - 2021-04-27T18:18:00+05:30

ఆక్సీమీటరు ఉపయోగించే విధానం పట్ల అవగాహన లేక, ఆక్సిజన్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయిన తర్వాత ఆస్పత్రులకు పరుగులెత్తే వాళ్లు ఎక్కువ. ఇంటిపట్టున కొవిడ్‌ చికిత్సను కొనసాగించే బాధితులు అత్యవసర స్థితి రాకుండా ఉండాలంటే, ఆక్సీమీటరు ఉపయోగించే విధానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(27-04-2021)

ఆక్సీమీటరు ఉపయోగించే విధానం పట్ల అవగాహన లేక, ఆక్సిజన్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయిన తర్వాత ఆస్పత్రులకు పరుగులెత్తే వాళ్లు ఎక్కువ. ఇంటిపట్టున కొవిడ్‌ చికిత్సను కొనసాగించే బాధితులు అత్యవసర స్థితి రాకుండా ఉండాలంటే, ఆక్సీమీటరు ఉపయోగించే విధానం తెలుసుకుని ఉండాలి. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అవేంటంటే...


ఆక్సీమీటరు ఉపయోగించే ముందు వేలి గోటికి ఉన్న నెయిల్‌ పాలిష్‌, నకిలీ గోరును తొలగించాలి. చేయి చల్లగా ఉంటే, రుద్ది వెచ్చబరచాలి.

ఆక్సీమీటరు పరీక్షకు ముందు ఐదు నిమిషాలు విశ్రాంత స్థితిలో ఉండాలి.

చేతిని ఛాతీ మీద, గుండెకు దగ్గరగా ఆనించి ఉంచాలి.

తర్వాత ఆక్సీమీటరును ఆన్‌ చేసి, చూపుడు వేలు లేదా మధ్య వేలుకు అమర్చాలి.

స్థిరమైన రీడింగ్‌కు కొంత సమయం పడుతుంది. రీడింగ్‌ హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటే, అది స్థిరంగా మారేవరకూ కనీసం ఒక నిమిషం పాటైనా అలాగే వదిలేయాలి. 

ఐదు సెకండ్ల పాటు మారకుండా ఉండే అత్యధిక రీడింగ్‌ను నమోదు చేసుకోవాలి. 

ప్రతి రోజూ వేళలు క్రమం తప్పకుండా రోజుకు మూడుసార్లు రీడింగ్‌ నమోదు చేసుకోవాలి.

ఇతరత్రా లక్షణాలు తీవ్రమైనా, విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న వాక్యం కూడా ఊపిరి కోసం ఇబ్బందిపడకుండా మాట్లాడలేకపోతున్నా, ఆక్సీమీటరు రీడింగ్‌ 9’2 శాతం అంతకంటే తగ్గినా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.

కొంతమందికి వైద్యులు ఆరు నిమిషాల నడకకు ముందు, తర్వాత ఆక్సీమీటరు రీడింగ్‌లు నమోదు చేసి చెప్పమని సూచిస్తారు. రీడింగ్‌లో 4శాతం హెచ్చుతగ్గులు కనిపిస్తే ఆస్పత్రిలో చేరవలసి ఉంటుంది.

Updated Date - 2021-04-27T18:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising