ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్లజుట్టును ఆపండిలా..!

ABN, First Publish Date - 2021-08-22T18:27:42+05:30

అక్కడక్కడా తెల్లజుట్టు కనిపించగానే ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లజుట్టు రావడాన్ని నిరోధించవచ్చు. అక్కడక్కడా కనిపిస్తున్న తెల్లజుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-08-2021)

అక్కడక్కడా తెల్లజుట్టు కనిపించగానే ఎక్కడలేని ఆందోళన మొదలవుతుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే తెల్లజుట్టు రావడాన్ని నిరోధించవచ్చు. అక్కడక్కడా కనిపిస్తున్న తెల్లజుట్టు నల్లగా మారేలా చేసుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే...


స్టవ్‌ పై ఒక పాత్రను పెట్టి ఒక కప్పు ఉసిరికాయ పొడిని వేడి చేయాలి. బూడిదగా మారే వరకు వేడిచేయాలి. తరువాత అరలీటరు కొబ్బరినూనె వేసి చిన్నమంటపై 20 నిమిషాల పాటు ఉంచాలి. స్టవ్‌పై నుంచి దింపుకొని పక్కన పెట్టాలి. మరుసటి రోజు జాలీతో వడగట్టి ఒక బాటిల్‌లోకి తీసుకోవాలి. ఈ నూనెతో వారంలో రెండు రోజులు తలకు మసాజ్‌ చేసుకోవాలి.

గుప్పెడు కరివేపాకు, రెండు టీస్పూన్ల ఉసిరికాయపొడి, రెండు టీస్పూన్ల బ్రాహ్మీపౌడర్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు మాస్క్‌లా పట్టించాలి. ఒక గంట తరువాత హెర్బల్‌ షాంపూతో కడిగేసుకోవాలి.

తెల్ల జుట్టు రావడాన్ని నిరోధించడంలో బ్లాక్‌ టీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బ్లాక్‌ టీ ఆకులను గోరువెచ్చటి నీటిలో నానబెట్టి, తరువాత మెత్తటి పేస్టులా చేసి, కొద్దిగా నిమ్మరసం కలిపి హెయిర్‌మాస్క్‌లా వేసుకోవాలి. నలభై నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి. క్రమంతప్పకుండా ఇలా చేస్తే తెల్ల జుట్టు కనిపించకుండా పోతుంది.

హెన్నాను చాలామంది ఉపయోగిస్తుంటారు. అయితే హెన్నాలో పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా జ్యూస్‌ వేసి పావుగంటపాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి రెడీ చేసి పెట్టుకోవాలి. ఉదయాన్నే తలకు పట్టించి మూడు గంటలపాటు వదిలేయాలి. తరువాత షాంపూతో స్నానం చేయాలి.


Updated Date - 2021-08-22T18:27:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising