ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తినడానికి మారాం చేసే పిల్లల్ని ఎలా మార్చాలి?

ABN, First Publish Date - 2021-10-13T18:28:04+05:30

పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే తగిన పోషకాహారం అవసరం. చిన్నతనం నుంచే చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చాలి. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ మొదలైన గింజల పొడిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-10-2021)

ప్రశ్న: మా బాబుకు ఏడేళ్లు. చాలా సన్నగా ఉంటాడు. తినడానికి బాగా మారాం చేస్తాడు. వాడిని ఎలా మార్చాలి?


- రోహిణి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే తగిన పోషకాహారం అవసరం. చిన్నతనం నుంచే చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చాలి. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చ మొదలైన గింజల పొడిని పిండిలో కలిపి చపాతీ, పరాఠాల లాంటివి చేసి ఇవ్వండి. వైద్యుల సలహాతో పాలల్లో శక్తిని ఇచ్చే పొడులు కలపండి. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు పెట్టవచ్చు. ఆకలి సరిగా లేకపోతే వైద్యుల సలహా మేరకు మందులు వాడవచ్చు. భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు లాంటివి పెట్టకూడదు. ఇంట్లో తయారుచేసిన నువ్వులు, బెల్లం ఉండలు, సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు మొదలైనవి రోజులో ఓసారి ఇవ్వండి. ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి గ్రైండ్‌ చేసి, మిల్క్‌ షేక్‌ లాగ తాగించండి. పిల్లలకు ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర చాలా అవసరం. రోజుకు కనీసం ఎనిమిది నుండి తొమ్మిది గంటలు నిద్ర పోయేలా చూడాలి.


డా. లహరి సూరపనేనే

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-10-13T18:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising