ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకాడో హెయిర్‌మాస్క్‌!

ABN, First Publish Date - 2021-03-25T19:56:21+05:30

బాలీవుడ్‌ వర్ధమాన నటి జాన్వీ కపూర్‌ ఈ మధ్యే తన నిండైన కురుల రహస్యాన్ని ఎమోజీల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అవకాడో, గుడ్డు, తేనె కలగలసిన ఈ హెయిర్‌మాస్క్‌ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ వర్ధమాన నటి జాన్వీ కపూర్‌ ఈ మధ్యే తన నిండైన కురుల రహస్యాన్ని ఎమోజీల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అవకాడో, గుడ్డు, తేనె కలగలసిన ఈ హెయిర్‌మాస్క్‌ను ఎలా తయారుచేయాలో చూద్దాం...


మగ్గిన అవకాడో (సగం ముక్క), టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక గుడ్డు, మీకు నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో గుడ్డును గిలకొట్టాలి. మరో గిన్నెలో అవకాడోను మెత్తని పేస్టులా చేయాలి. ఇప్పుడు అవకాడో పేస్ట్‌లో తేనె, ఎసెన్షియల్‌ ఆయిల్‌  వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమానికి గిలకొట్టిన గుడ్డు కలిపి జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. షాంపూ, కండిషనింగ్‌  మరచిపోవద్దు. 


ఈ హెయిర్‌ మాస్క్‌ లాభాలివి:

అవకాడోలోని సహజ నూనెలు, పాలీఅన్‌సాచురేటెడ్‌, మోనోఅన్‌సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు పొడి, నిర్జీవమైన కురులకు పోషణనిచ్చి, జీవం తెస్తాయి. గుడ్డులోని అమినోఆమ్లాలు, విటమిన్లు కేశాలను ఆరోగ్యంగా, పట్టులా మారుస్తాయి. గుడ్డు పచ్చసొన వెంట్రుకలు దెబ్బతినకుండా చూస్తుంది. తేనె మాయిశ్చరైజర్‌గా పనిచేసి కురులు చిట్లిపోవడాన్ని అడ్డుకుంటుంది. కేశాలను మృదువుగా చేసి  మెరుపును అందిస్తుంది.  

Updated Date - 2021-03-25T19:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising