ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జుట్టు నెరవకుండా...

ABN, First Publish Date - 2021-05-22T20:01:13+05:30

చిన్న వయసులోనే జుట్టు నెరవడం సర్వసాధారణంగా కనిపిస్తున్న సమస్య. దీనికి జన్యుపరమైన అంశాలతో పాటు వాతావరణ కాలుష్యం, ఆధునిక జీవన శైలి, ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోవడం... వంటి అనేక కారణాలున్నాయి. ఇంట్లోనే లభించే పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న వయసులోనే జుట్టు నెరవడం సర్వసాధారణంగా కనిపిస్తున్న సమస్య. దీనికి జన్యుపరమైన అంశాలతో పాటు వాతావరణ కాలుష్యం, ఆధునిక జీవన శైలి, ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోవడం... వంటి అనేక కారణాలున్నాయి. ఇంట్లోనే లభించే పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.


జుట్టు బాగా ఎదగడానికీ, నల్లగా ఉండడానికీ ఉసిరికాయ ఎంతో సహాయపడు తుంది. ఆహారంలో ఉసిరిని తీసుకుంటే జుట్టు నెరవడాన్ని నిరోధించవచ్చు. అలాగే నాలుగైదు ఎండిన ఉసిరికాయ ముక్కలను కాస్త కొబ్బరి నూనెలో మరిగించి, గోరువెచ్చగా అయిన తరువాత తలపై మర్దనా చేసుకోవాలి. ఆయిలీ స్కిన్‌ వారు ఉసిరికాయల రసంతో మర్దనా చేసుకోవచ్చు. తరువాత గాఢత తక్కువగా ఉండే హెర్బల్‌ షాంపూతో తలను కడిగేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. 


శీకకాయ జుట్టు నెరవడాన్ని నిరోధించడమే కాదు, ఇతర శిరోజ సమస్యలకూ చక్కని పరిష్కారం. దీనితో సహజసిద్ధమైన షాంపూను సొంతంగా తయారు చేసుకోవచ్చు. నాలుగైదు శీకకాయ ముక్కలనూ, పది నుంచి పన్నెండు కుంకుడు గింజలనూ ఇనుప పాత్రలో ఉంచి, తగినంత నీరు పొయ్యండి. రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తరువాత దాన్ని మరగబెట్టి, ఒక సీసాలో పోసుకోండి. వారానికి రెండురోజులు ఆ రసంతో తల రుద్దుకుంటే కేశ సమస్యలు అనేకం పరిష్కారమవుతాయి. 


Updated Date - 2021-05-22T20:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising