ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ తర్వాత జుట్టు రాలుతోందా?

ABN, First Publish Date - 2021-08-10T19:05:43+05:30

కొవిడ్‌ నుంచి కోలుకున్న ఎక్కువ మందిలో జుట్టు రాలే సమస్య తలెత్తుతూ ఉంటుంది. వైరస్‌తో పోరాడే క్రమంలో శరీరంలో విడుదలయ్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-08-2021)

కొవిడ్‌ నుంచి కోలుకున్న ఎక్కువ మందిలో జుట్టు రాలే సమస్య తలెత్తుతూ ఉంటుంది. వైరస్‌తో పోరాడే క్రమంలో శరీరంలో విడుదలయ్యే రసాయనాల ప్రభావం వెంట్రుకల మీద పడుతుంది. దాంతో కొవిడ్‌ నుంచి కోలుకున్న కొన్ని వారాల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. అయితే అసహజమైన పరిస్థితి కాదు. ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకునే క్రమంలోనైనా వెంట్రుకలు రాలతాయి. అయితే ఈ సమస్య కొన్ని నెలల్లోనే దానంతట అది సమసిపోయి, తిరిగి కొత్త వెంట్రుకలు పెరుగుతాయి. వెంట్రుకలు రాలడానికి కొవిడ్‌ వైరస్‌ శరీరంపై కలిగించిన ఒత్తిడితో పాటు, మానసిక ఒత్తిడి కూడా ఈ సమస్యకు తోడవుతూ ఉంటుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న ఒకటి నుంచి మూడు నెలల తర్వాత కొవిడ్‌ సమయంలో టెలోజెన్‌ దశలోకి ప్రవేశించిన వెంట్రుకలు, తర్వాత కొత్త వెంట్రుకలకు చోటు కల్పించడం కోసం ఊడిపోతూ ఉంటాయి. దాంతో రోజుకు వంద నుంచి రెండు వందల వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి 3 నుంచి 6 నెలల్లో సర్దుకుంటుంది. అయితే పోషకాలతో కూడిన ఆహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానంతో ఈ సమస్య నుంచి త్వరగా బయటపడే వీలూ లేకపోలేదు. కొందరికి హెయిర్‌ సప్లిమెంట్లు, పెప్టైడ్‌ ఆధారిత సీరమ్‌లు ఉపయోగపడతాయి.


Updated Date - 2021-08-10T19:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising