ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొన్నేళ్లుగా ఆ సమస్యతో బాధపడుతున్నా.. పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలి?

ABN, First Publish Date - 2021-12-17T18:22:31+05:30

నాకు 60 ఏళ్లు. కొన్నేళ్లుగా గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నాను. గాస్త్రోఎంటరాలజిస్ట్‌లకు చూపించినప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-12-2021)

ప్రశ్న: నాకు 60 ఏళ్లు. కొన్నేళ్లుగా గ్యాస్‌, ఎసిడిటీతో బాధపడుతున్నాను. గాస్త్రోఎంటరాలజిస్ట్‌లకు చూపించినప్పుడు ఏమీలేదంటూ పాన్‌ డి తదితర మందులు ఇచ్చారు. అయినా ప్రయోజనం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేలా తగిన డైట్‌ ప్రణాళిక సూచించగలరు.


- అఖిలాండేశ్వరి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వృద్ధాప్యంలో శరీరంలోని మిగిలిన కండరాలలానే జీర్ణాశయంలోని ఆమ్లాలు, జీర్ణరసాలు పైకి రాకుండా నియంత్రించే కండరాల పటుత్వం కొంత తగ్గుతుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య ఎక్కువవుతుంది. అలాగే, ఐబీయస్‌ (ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌) లక్షణాలైన గ్యాస్‌, కాన్‌స్టిపేషన్‌ లేదా డయేరియా లాంటివి కూడా వయసు పెరిగే కొద్దీ ఎక్కువ వుతాయి. ఎసిడిటీ సమస్యకు డాక్టర్‌ సలహా మేరకు మందులు కొనసాగిస్తూనే మీరు తీసుకునే ఆహారం, ఆ రోజు కలిగిన మార్పులు ఓ డైరీలా రాసి పెట్టుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఇబ్బందిగా ఉంటుందో గుర్తించడం తేలికవుతుంది. ఐబీఎస్‌ లక్షణాలు అందరికీ ఒకే ఆహారం వల్ల రావు. కాబట్టి ఆహారం, లక్షణాల డైరీ... కనీసం ఓ నెల పాటు రాస్తే దాని సహాయంతో మీ శరీరానికి సరిపడే డైట్‌ ప్లాన్‌ సూచించేందుకు పోషకాహార నిపుణులతో మాట్లాడవచ్చు. సమయానుసారం తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు కూర్చొని ఉండడం, రోజులో కాసేపైనా తేలిక పాటి వ్యాయామం చేయడం మీ సమస్యకు కొంత పరిష్కారం.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు) 

Updated Date - 2021-12-17T18:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising