ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తళుక్కున మెరిసేందుకు!

ABN, First Publish Date - 2021-02-10T18:26:55+05:30

ముఖం కళ తప్పిపోయి నిర్జీవంగా కనిపిస్తుంటే వంటింట్లోనే టొమాటోతో తాజాదనాన్ని సొంత చేసుకోవచ్చు. టొమాటోతో ముఖంపై రుద్దుకున్నా లేదా ఫేస్‌ప్యాక్‌ వేసుకున్నా చర్మం కాంతివంతమవుతుంది. టొమాటో సౌందర్య సాధనంగా ఎలా పనికొస్తుందో చూద్దాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-02-2021)

ముఖం కళ తప్పిపోయి నిర్జీవంగా కనిపిస్తుంటే వంటింట్లోనే టొమాటోతో తాజాదనాన్ని సొంత చేసుకోవచ్చు. టొమాటోతో ముఖంపై రుద్దుకున్నా లేదా ఫేస్‌ప్యాక్‌ వేసుకున్నా చర్మం కాంతివంతమవుతుంది. టొమాటో సౌందర్య సాధనంగా ఎలా పనికొస్తుందో చూద్దాం...


టొమాటోలోని ఎ, బి6, సి, ఇ కె విటమిన్లు చర్మాన్ని మెరిసేలా చేసి, చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తాయి. వీటిలోని ఆమ్లం చర్మం పీహెచ్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. 

టొమాటోలో ఉండే సెలిసిలిక్‌ యాసిడ్‌ను పలు ఫేస్‌ లోషన్లు, క్రీముల తయారీలో వాడతారు. ఇది ముఖాన్ని శుభ్రం చేయడమే కాదు ముఖంపై మచ్చలను పోగొడుతుంది. తేలికగా, తీవ్రస్థాయిలో ఉండే యాక్నే సమస్యపై టొమాటోలు బాగా పనిచేస్తాయి. 

మొటిమలు వల్ల ఏర్పడిన మచ్చలు కూడా టోమాటో ఫేస్‌ప్యాక్‌తో పోతాయి. పోగొడతాయి. అందుకే స్కిన్‌ కేర్‌ విషయంలో టొమోటోలు నిత్యం అవసరమే.  

టొమాటోను గుండ్రని ముక్కలుగా కట్‌ చేయాలి. వాటితో వృత్తాకారంలో ముఖంపై మృదువుగా మర్దనా చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. 

టొమాటోలను మెత్తటి గుజ్జులా చేసి అందులో రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి  నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. దాంతో చర్మం తాజాదనాన్ని పొంది వెలిగిపోతుంది.


Updated Date - 2021-02-10T18:26:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising