ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫోలిక్‌ యాసిడ్‌ ఇలా...

ABN, First Publish Date - 2021-05-10T17:20:26+05:30

ఫోలిక్‌ యాసిడ్‌ శరీరానికి చాలా అవసరం. అయితే మాత్రల రూపంలో కాకుండా ఆహారం ద్వారా శరీరానికి తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభించేలా చూసుకోవాలి. ఏయే ఆహారపదార్థాల్లో ఎంత ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుందంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫోలిక్‌ యాసిడ్‌ శరీరానికి చాలా అవసరం. అయితే మాత్రల రూపంలో కాకుండా ఆహారం ద్వారా శరీరానికి తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభించేలా చూసుకోవాలి. ఏయే ఆహారపదార్థాల్లో ఎంత ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుందంటే....


ఫోలిక్‌యాసిడ్‌ లెవెల్స్‌ పెరగాలంటే పాలకూర, సోయాను డైట్‌లో చేర్చండి. వీటిని ఒక కప్పు తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది.

బీన్స్‌, బఠాణీలో ఫోలిక్‌ యాసిడ్‌ అధిక శాతం ఉంటుంది. అంతేకాకుండా చిన్న కప్పు కాయధాన్యాలను తీసుకున్న తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.

ఒక కప్పు అవొకడో తీసుకుంటే రోజూ తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌లో 22 శాతం లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్‌ ఎ, కె, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి.

గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగలు తీసుకున్నా తగినంత ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. డ్రైఫూట్స్‌ తిన్నా ఫలితం ఉంటుంది.

దుంపల్లో యాంటీఆక్సిడెంట్లు, డిటాక్సిఫికేషన్‌ ఎలిమెంట్లు ఉంటాయి. ఒకకప్పు దుంపలు తీసుకుంటే ఒక రోజు తీసుకోవాల్సిన ఫోలిక్‌యాసిడ్‌లో 34 శాతం అందుతుంది. 

ఆరెంజ్‌, బొప్పాయి, అరటిపండ్లు, గ్రేప్స్‌, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో ఫోలిక్‌ యాసిడ్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది.

బెండకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. ఒక కప్పు బెండ తీసుకుంటే 37 మైక్రోగ్రాముల ఫోలిక్‌ యాసిడ్‌ లభిస్తుంది.

కార్న్‌లో ఫోలేట్‌ అధికంగా ఉంటుంది. ఒకకప్పు ఉడికించిన కార్న్‌ తీసుకుంటే రోజు తీసుకోవాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌లో 20 శాతం అందుతుంది. 

క్యారెట్‌ను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఒక కప్పు క్యారెట్‌జ్యూస్‌  రోజూ తీసుకోవాల్సిన ఫోలిక్‌యాసిడ్‌లో 5 శాతాన్ని అందిస్తుంది.


Updated Date - 2021-05-10T17:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising