ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడుస్తుంటే బాగా ఆయాసం వస్తుంది.. ఏం చేయాలి?

ABN, First Publish Date - 2021-10-01T19:03:40+05:30

కొత్తగా నడక లేదా ఏదైనా వ్యాయామం మొదలు పెట్టినప్పుడు ఆస్తమా, ఆందోళన, శారీరక శ్రమ ఎక్కువ కావడం, ఊబకాయం లేదా అధిక బరువు ఉండడం తదితర కారణాల వల్ల ఆయాసం వస్తుంది. మీ ఆయాసానికి కారణాన్ని తెలుసుకొని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(01-10-2021)

ప్రశ్న: నాకు యాభై ఏళ్లు. నడుస్తుంటే బాగా ఆయాసం వస్తోంది. ఆహారం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చా?


- వెంకట్‌రెడ్డి, విజయవాడ


డాక్టర్ సమాధానం: కొత్తగా నడక లేదా ఏదైనా వ్యాయామం మొదలు పెట్టినప్పుడు ఆస్తమా, ఆందోళన, శారీరక శ్రమ ఎక్కువ కావడం, ఊబకాయం లేదా అధిక బరువు ఉండడం తదితర కారణాల వల్ల ఆయాసం వస్తుంది. మీ ఆయాసానికి కారణాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొంటే సమస్య తీరుతుంది. మితంగా సమతులాహారం తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంచు కోవచ్చు. ఆహారంలో తాజా పండ్లు అధికంగా తీసుకొంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా ఆయాసాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. మీకు ఎటువంటి గుండె జబ్బులు లేనట్టయితే, ఆయాసం వస్తోంది  కనుక నడక మానెయ్యకుండా, మీరు సాధారణంగా నడవ గలిగే వేగంతోనే నడకను క్రమం తప్పకుండా కొనసాగించడం ద్వారా కొద్దివారాలలో మీ గుండె పని తీరు, సామర్ధ్యం మెరుగుపడి నెమ్మదిగా ఆయాసం సమస్య కూడా తగ్గుతుంది.

  

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-10-01T19:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising