ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో లభించే పాలతో ఇలా చేస్తే ముఖం నిగనిగలాడుతుంది.. మీరూ ట్రై చేయండి!

ABN, First Publish Date - 2021-12-16T18:37:36+05:30

పాలలో ల్యాక్టిక్‌ యాసిడ్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియంతో పాటుగా అనేక ప్రొటీన్లు ఉంటాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-12-2021)

పాలలో ల్యాక్టిక్‌ యాసిడ్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియంతో పాటుగా అనేక ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మన చర్మకణాల పునరుత్పత్తిని వేగవంతం చేయటంతో పాటుగా చర్మం నిగనిగలాడేలా చేస్తాయి. ఇన్ని రకాల మంచిలక్షణాలున్న పాలతో ఫేస్‌ ప్యాక్‌లు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం..


ఓట్స్‌తో...

ఈ మధ్య కాలంలో చాలా మంది ఓట్స్‌ను తింటున్నారు. ఈ ఓట్స్‌కు చర్మంపై మృతకణాలను తొలగించే శక్తి ఉంది. అందువల్ల ఓట్స్‌ను పాలతో కలిపి ముద్దగా చేసి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఆరబెట్టాలి. ఆ తర్వాత వేడి నీళ్లతో కడగాలి. ఓట్స్‌తో పాటుగా అరటి పండును కూడా కలిపితే చర్మానికి అదనపు కాంతి చేకూరుతుంది. 


బొప్పాయితో...

బాగా పండిన బొప్పాయిని ముద్దగా చేసుకోవాలి. దీనిలో తగినన్ని పాలు పోయాలి. చర్మం పొడిగా ఉండేవారు ఈ మిశ్రమంలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను వేస్తే మంచిది. తేనె వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. ఈ బొప్పాయి మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 


టిప్‌

ఫేస్‌ ఫ్యాక్‌ వేసుకొనే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. దీని వల్ల ముఖంపై ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. 

Updated Date - 2021-12-16T18:37:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising