ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిపి ఎక్కువ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ABN, First Publish Date - 2021-02-10T20:58:53+05:30

అధిక రక్తపోటు ఉన్నవారు ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే, కాస్త తగ్గినా కూడా నియంత్రణలోకి వస్తుంది. ఆహారంలో సోడియం లేదా ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకునే పప్పు, కూరలలో ఉప్పు తగ్గించాలి. ఊరగాయలు, పచ్చళ్ళు, ఉప్పు కలిపి చేసే పిండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-02-2020)

ప్రశ్న: నాకు అరవై ఏళ్లు. అధిక రక్తపోటు ఉంది. ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?


- విభీషణరావు, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: అధిక రక్తపోటు ఉన్నవారు ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే, కాస్త తగ్గినా కూడా నియంత్రణలోకి వస్తుంది. ఆహారంలో సోడియం లేదా ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రోజూ తీసుకునే పప్పు, కూరలలో ఉప్పు తగ్గించాలి. ఊరగాయలు, పచ్చళ్ళు, ఉప్పు కలిపి చేసే పిండి వంటలు, చిరుతిళ్ళు మానెయ్యాలి. మీ ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వారానికి నాలుగు రోజులు ఆకుకూరలు తినాలి. అధిక రక్తపోటు చాలా కాలం నియంత్రణలో లేకపోతే భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆహారంలో సాచురేటెడ్‌ కొవ్వులు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధిక నూనెలో వేయించిన వేపుళ్ళు, చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్‌ లాంటి వాటికి దూరంగా ఉండండి. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే సరైన ఆహార నియమాలతో పాటు రోజూ వ్యాయామం కూడా ముఖ్యం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


Updated Date - 2021-02-10T20:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising