ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్ర రావడం లేదా? అయితే ఇలా చేసి చూడండి..

ABN, First Publish Date - 2021-10-13T18:41:26+05:30

వయసు పెరిగే కొద్దీ శరీరానికి నిద్ర అవసరం కొంత తగ్గుతుంది. అయితే, వీరికి కూడా కనీసం ఆరుగంటల నిద్ర కావాలి. ఆందోళనలు, శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాల వల్ల కొంత మందిలో నిద్రలేమి ఏర్పడుతుంది. సరిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-10-2021)

ప్రశ్న: నిద్రలేమికి ఆహారంతో ఏదైనా పరిష్కారం ఉంటుందా?


- హారిక, అనంతపురం


డాక్టర్ సమాధానం: వయసు పెరిగే కొద్దీ శరీరానికి నిద్ర అవసరం కొంత తగ్గుతుంది. అయితే, వీరికి కూడా కనీసం ఆరుగంటల నిద్ర కావాలి. ఆందోళనలు, శారీరక శ్రమ లేకపోవడం లాంటి కారణాల వల్ల కొంత మందిలో నిద్రలేమి ఏర్పడుతుంది. సరిగా నిద్ర పట్టడంలో ఆహార పాత్ర కూడా కొంత ఉంది. నిద్ర కు అవసరమైన మెలటోనిన్‌ అనే హార్మోను ఉత్పత్తికి సహకరించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంత ఎదుర్కోవచ్చు. పడుకోవడానికి అరగంట ముందు గోరు వెచ్చని పాలు, మొలకెత్తిన రాగుల పిండితో చేసిన జావ, అరటి, కివి పండు, బాదం లేదా జీడిపప్పు మొదలైనవి తీసుకొంటే నిద్ర పడుతుందని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అలాగే, రాత్రి భోజనంలో రొట్టెలు బదులుగా తక్కువ పరిమాణంలో అన్నం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఆందోళన అధికంగా ఉన్నప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే కార్టిసాల్‌ అనే హార్మోను కూడా నిద్రలేమికి కారణమే. ఆందోళన తగ్గించుకునేందుకు యోగ, ప్రాణాయామం చేయడం మంచిది. 


డా. లహరి సూరపనేనే

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2021-10-13T18:41:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising