ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్ర కరువైతే డిమెన్షియా!

ABN, First Publish Date - 2021-04-22T17:32:51+05:30

యాభై, అరవై ఏళ్ల వయస్సున్న వారు ఆరుగంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయినట్లయితే డిమెన్షియా వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. నిద్రకు, డిమెన్షియాకు ఉన్న సంబంధాన్ని విశ్లేషించడంపై పరిశోధనలు చేసిన లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాభై, అరవై ఏళ్ల వయస్సున్న వారు ఆరుగంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయినట్లయితే డిమెన్షియా వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు గుర్తించారు. నిద్రకు, డిమెన్షియాకు ఉన్న సంబంధాన్ని విశ్లేషించడంపై పరిశోధనలు చేసిన లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలు ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు 8వేల మందిపై పరిశోధనలు జరిపారు.


అధ్యయనం వివరాలను నేచర్‌ కమ్యునికేషన్స్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. 7 గంటలు నిద్రపోతున్న వారితో పోల్చితే 6 గంటలు  లేదా అంత కన్నా తక్కువ సమయం నిద్రపోయే వారిలో డిమెన్షియా రిస్క్‌ 30 శాతం ఎక్కువ ఉన్నట్లు తేలింది. మిడిల్‌ ఏజ్‌ గ్రూప్‌లో ఉన్న వారు మానసిక సమస్యలు, ఒత్తిడి వంటివి నిద్రలేమికి కారణమవుతుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటి డిమెన్షియా కేసులు నమోదవుతున్నాయి. డిమెన్షియా రాకుండా చూసుకోవాలంటే మానసికంగా, శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం, పోషకాహారం తీసుకోవడం, పొగతాగే అలవాటు ఉంటే మానుకోవడం, వ్యాయామం వంటివి క్రమంతప్పకుండా చేయాలి.

Updated Date - 2021-04-22T17:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising