ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు రెండోసారి కరోనా ముప్పు!

ABN, First Publish Date - 2021-04-30T17:03:54+05:30

ఒకసారి కరోనా సోకిన యువతకు.. మళ్లీ ఆ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెంట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మొదటి సారి ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు ఉండే యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉండడం లేదని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాంటీబాడీలు ఎక్కువకాలం ఉండడం లేదు

వ్యాక్సిన్‌ తీసుకోవడం ఒక్కటే పరిష్కారం: స్టడీ


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: ఒకసారి కరోనా సోకిన యువతకు.. మళ్లీ ఆ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెంట్‌ రెస్పిరేటరీ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మొదటి సారి ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు ఉండే యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉండడం లేదని, పైగా.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో రీ-ఇన్ఫెక్షన్‌ అవకాశాలు ఎక్కువ అని పేర్కొంది. అమెరికా నౌకాదళానికి చెందిన 18-20 ఏళ్ల మధ్య వయసున్న 3,000 మంది యువ రిక్రూటర్లపై మౌంట్‌ సినాయ్‌లోని ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. వీరిలో 189 మందికి రెండు సార్లు కరోనా సోకిందని గుర్తించారు. రెండో సారి వైరస్‌ సోకినప్పుడు చాలా మందిలో లక్షణాలు లేవని పేర్కొన్నారు. ఇలాంటి వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాప్తిచెందే ప్రమాదముందన్నారు. మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ఏర్పడ్డ యాంటీబాడీలు ఎక్కువ కాలం ఉండకపోవడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి కారణాలు రెండో సారి ఇన్ఫెక్షన్‌కు దోహదపడుతున్నాయని.. ఈ సమస్యకు వ్యాక్సిన్‌ తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని పేర్కొన్నారు.

Updated Date - 2021-04-30T17:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising