ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొబ్బరినూనెతో ఇలా చేస్తే జుట్టే కాదు.. ముఖం కూడా మెరిసిపోతుంది!

ABN, First Publish Date - 2021-09-30T18:21:01+05:30

కేరళలో కొబ్బరినూనెతో ఆహార పదార్థాలు చేస్తారు. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్ముతారు. అయితే చాలా దేశాల్లో కొబ్బరి నూనెను మాత్రం జుట్టు, చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తారు. కొబ్బరినూనె పట్టిస్తే నిజంగా ముఖం నల్లగా అవుతుందా? ఇంతకీ కొబ్బరి నూనెను ముఖారవిందాన్ని మెరుగుపర్చుకోవాలంటే.. ఎలా ఉపయోగించాలి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(30-09-2021)

కేరళలో కొబ్బరినూనెతో ఆహార పదార్థాలు చేస్తారు. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్ముతారు. అయితే చాలా దేశాల్లో కొబ్బరి నూనెను మాత్రం జుట్టు, చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తారు. కొబ్బరినూనె పట్టిస్తే నిజంగా ముఖం నల్లగా అవుతుందా? ఇంతకీ కొబ్బరి నూనెను ముఖారవిందాన్ని మెరుగుపర్చుకోవాలంటే.. ఎలా ఉపయోగించాలి?


ముఖానికి కొబ్బరినూనె పూయాలా లేదా అనే సందేహం కలిగే ముందు.. ముందు మీ చర్మం పొడిగా ఉంటుందా? ఆయిలీ స్కిన్నా? అనే విషయం తెలుసుకోవాలి. ఆయిలీ స్కిన్‌ అయితే మాత్రం కొబ్బరినూనె పూయాల్సిన అవసరం లేదు. అయితే కొబ్బరినూనెను స్క్రబ్బర్‌గా ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఒక కప్పులో రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్‌ చక్కెర వేయాలి. అది కూడా కాఫీ షాప్స్‌లో వాడే అతి చిన్న స్పటికాలుండే చక్కెర తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపాక.. ఆ మిశ్రమానికి ముఖానికి స్క్రబ్బర్‌లా పట్టించుకుని కడిగేయాలి. చర్మంలో మెరుపు వస్తుంది. 


అర టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడాను ఒక కప్పులో తీసుకుని మెత్తగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక మైల్డ్‌ సబ్బుతో ముఖాన్ని కడిగేయాలి. 


ఇలానే ఒక కప్పులో రెండు టీస్పూన్ల కొబ్బరినూనె తీసుకోవాలి. ఇందులోకి నాలుగు టీ స్పూన్ల అలొవెరా జెల్‌ను మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.


ఒక కప్పులో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరినూనె, టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టీ స్పూన్‌ నిమ్మరసంను మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడ భాగానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచాలి.


Updated Date - 2021-09-30T18:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising