ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోటి శుభ్రతతో ఇన్ఫెక్షన్‌కు చెక్‌

ABN, First Publish Date - 2021-06-03T17:02:53+05:30

సరైన జాగ్రత్తలు పాటించకపోతే శ్వాస ద్వారా, నోటి ద్వారా కరోనా ఇన్ఫెక్షన్‌ సోకుతుందన్నది తెలిసిందే. మాస్కులు సరిగ్గా ధరించని వారితో పాటు నోటి శుభ్రత పాటించని వారు కరోనా బారిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-06-2021)

సరైన జాగ్రత్తలు పాటించకపోతే శ్వాస ద్వారా, నోటి ద్వారా కరోనా ఇన్ఫెక్షన్‌ సోకుతుందన్నది తెలిసిందే. మాస్కులు సరిగ్గా ధరించని వారితో పాటు నోటి శుభ్రత పాటించని వారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ అని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీరియాడోంటాలజీ (ఎఎపి) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారిపై కరోనా వైరస్‌ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఎఎపి నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. 


రోజూ రెండు సార్లు బ్రష్‌ చేసుకోండి. ముఖ్యంగా రాత్రి నిద్రపోవడానికి ముందు దంతాలను శుభ్రపరుచుకుంటే మంచిది. సాఫ్ట్‌గా ఉండే టూత్‌ బ్రెష్‌ను ఉపయోగించడం వల్ల పళ్ళపై ఉండే ఎనామిల్‌ దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే అదే పనిగా దంతాలను తోమెయ్యడం కూడా మంచిది కాదు. 

నోటి ఆరోగ్యంలో నాలుక శుభ్రత కీలకం. నాలుక పరిశుభ్రంగా లేకపోతే నోటి దుర్వాసన మాత్రమే కాదు, మరెన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి బ్రష్‌ చేసిన ప్రతిసారీ నాలుకను కూడా క్లీన్‌ చేసుకోవాలి.

కేవలం నోటికే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి నీరు ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా తిన్న తరువాత నీరు తాగితే నోరు శుభ్రంగా ఉంటుంది. నోటిని అంటిపెట్టుకొనే యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం, పానీయాల వల్ల కలిగే దుష్ప్రభావాలను తగినంత నీరు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. చక్కెర, యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. 

పొగ తాగేవారికి కరోనా సోకే రిస్క్‌ ఎక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం నోటికీ, దంతాలకూ నష్టం కలిగిస్తుంది. కాబట్టి పొగ తాగే అలవాటును వదిలెయ్యడం శ్రేయస్కరం.

నోటిలో అల్సర్లు, నోటి పూత, గొంతు మంట, దంతాల నొప్పి... ఇలాంటి ఏ ఇబ్బంది తలెత్తినా నిర్లక్ష్యం చెయ్యకండి. ఏడాదికి ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవడం వల్ల మీరు గుర్తించని సమస్యలేవైనా ఉంటే... వాటికి చికిత్స తీసుకొని, మరీ తీవ్రంగా మారకుండా చూసుకోవచ్చు. 

Updated Date - 2021-06-03T17:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising