ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడిని దూరం చేద్దామిలా...

ABN, First Publish Date - 2021-10-21T16:38:09+05:30

ఇటీవల మానసిక ఒత్తిడితో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగింది. ముఖ్యంగా కొవిడ్‌ తరువాత ఈ సమస్య ఎక్కువయింది. అయితే ఇలా చేయడం ద్వారా వాటిని మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(21-10-2021)

ఇటీవల మానసిక ఒత్తిడితో బాధపడే వారి సంఖ్య చాలా పెరిగింది. ముఖ్యంగా కొవిడ్‌ తరువాత ఈ సమస్య ఎక్కువయింది. అయితే ఇలా చేయడం ద్వారా వాటిని మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలంటే...


మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి బ్రీతింగ్‌ వ్యాయామాలు చక్కగా పనిచేస్తాయి. ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చి నాలుగు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టాలి. తరువాత వదిలేయాలి. ఇలా పలుమార్లు చేయాలి.


బిజీ జీవనం, పని ఒత్తిడిలో పడి కృతజ్ఞత చెప్పడం మరిచిపోతున్నారు. మనకు సహాయపడిన వారికి, ఆపద సమయంలో ఆదుకున్న వారికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు మనసుకు ఎంతో హాయి కలుగుతుంది. కృతజ్ఞత ఒక ఎమోషనల్‌ టూల్‌కిట్‌గా ఉపయోగపడుతుంది.


 రోజూ అరగంట ధ్యానం కోసం తప్పక కేటాయించాలి. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేయాలి. 


ఇష్టమైన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లాలి. స్నేహితునితో కాసేపు మాట్లాడటం, ఇష్టమైన సినిమాకు వెళ్లడం, మంచి పుస్తకం చదవడం... ఇలాంటివన్నీ ఒత్తిడిని దూరం చేస్తాయి.


శారీరక వ్యాయామం మానసిక ఆరోగ్యంపైనా, భావోద్వేగాలపైనా పాజిటివ్‌ ఇంపాక్ట్‌ను చూపిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. అది జాగింగ్‌ కావచ్చు లేదా మీ రూమ్‌లో ఇష్టమైన సంగీతం పెట్టుకుని చేసే చేసే డ్యాన్స్‌ కూడా కావచ్చు. ఇలా చేయడం వల్ల హ్యాప్పీ హార్మోన్స్‌గా పిలిచే ఎండార్ఫిన్స్‌ విడుదలయి మనసుకు హాయి కలుగుతుంది.

Updated Date - 2021-10-21T16:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising