ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

coffee పొడితో ముఖానికి మెరుపులు

ABN, First Publish Date - 2021-07-22T17:33:17+05:30

కాఫీ తాగడానికే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచుకొనేందుకు ఉపయోగపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మకణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌పై పోరాటానికి సహాయపడతాయి. ఇంకా ఏం ప్రయోజనాలున్నాయంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-07-2021)

కాఫీ తాగడానికే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచుకొనేందుకు ఉపయోగపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన చర్మకణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌పై పోరాటానికి సహాయపడతాయి. ఇంకా ఏం ప్రయోజనాలున్నాయంటే...


కాఫీలో ఉండే కెఫిన్‌ డార్క్‌ సర్కిల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కాఫీలో ఉండే న్యాచురల్‌ బ్లీచింగ్‌ ఏజెంట్స్‌ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి. ఒక టేబుల్‌స్పూన్‌ కాఫీపౌడర్‌లో ఒక టీస్పూన్‌ తేనె, నాలుగైదు చుక్కలు విటమిన్‌ ఇ ఆయిల్‌ వేసి కళ్ల కింద రాయాలి. పావుగంట తరువాత కడిగేసుకోవాలి.


మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి కాఫీ సహాయపడుతుంది. మూడు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడి, రెండు టేబుల్‌స్పూన్ల షుగర్‌, మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంలా చేసి ముఖం నెమ్మదిగా రబ్‌ చేయాలి. పది నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి.


కాఫీ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు, మచ్చలు తొలగిపోయి నిగారింపు సంతరించుకుంటుంది. కాఫీ పౌడర్‌, కోకా పౌడర్‌ను ఒక బౌల్‌లో తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్టులా చేయాలి. తరువాత రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


ఒక బౌల్‌లో కొద్దిగా కాఫీ పొడి తీసుకుని అందులో 3 టేబుల్‌స్పూన్ల అలోవెరా జెల్‌ వేసి ముఖంపై నెమ్మదిగా స్క్రబ్‌ చేయాలి. పదినిమిషాల తరువాత కడిగేసుకోవాలి. చర్మం సహజసిద్ధమైన మెరుపు సంతరించుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది.


Updated Date - 2021-07-22T17:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising