ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక ఒత్తిడిని తగ్గించే మష్రూమ్‌ టీ!

ABN, First Publish Date - 2021-02-15T18:31:11+05:30

పుట్టగొడుగులు రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిల్లో పీచుపదార్ధాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఎసెన్షియల్‌ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో తయారుచేసిన టీ తాగితే లభించే ప్రయోజనాలు అనేకం అని అంటున్నారు నిపుణులు. అవేమిటంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(15-02-2021)

పుట్టగొడుగులు రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిల్లో పీచుపదార్ధాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఎసెన్షియల్‌ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో తయారుచేసిన టీ తాగితే లభించే ప్రయోజనాలు అనేకం అని అంటున్నారు నిపుణులు. అవేమిటంటే...


మష్రూమ్‌లో ప్రొటీన్లు ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ టీ తాగితే బరువు తగ్గుతారు.


ఈ టీ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.


గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి జబ్బుల్లో ఉపయోగించే మందుల్లో కూడా వీటిని వాడతారు.


ఈ టీ జీర్ణక్రియ బాగా జరిగేలా సహకరిస్తుంది. వీటిల్లో పీచుపదార్థాలు, మాంసకృతులు ఉండడం వల్ల అరుగుదల సులభంగా అవుతుంది. జీర్ణవ్యవస్థను కూడా ఇది  క్రమబద్ధీకరిస్తుంది. 


మష్రూమ్స్‌లో పొటాషియం ఎక్కువగా, సోడియం పరిమాణం తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.


వీటిల్లో విటమిన్‌-డి ఉంటుంది. అందుకే మష్రూమ్స్‌ని తినడం లేదా వీటితో చేసిన టీ తాగడం వల్ల ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. బరువు తగ్గుతారు. ఫ్లూ జ్వరాలు, ఇతర వ్యాధులు సోకకుండా నిరోధక శక్తి పెరుగుతుంది.


వీటిల్లో ఉండే పోషకాలు, పీచుపదార్థాలు, విటమిన్ల వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పుంజుకుంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారపదార్థాలు మాత్రమే కాకుండా మష్రూమ్‌ టీ తాగితే  శరీరానికి ఎంతో మంచిది.


టీ ఎలా తయారు చేయాలంటే..


కావలసిన పదార్థాలు: ఒక అంగుళం ఉండే ఛాగా మష్రూమ్‌ క్యూబ్‌ లేదా ఛాగా టీ బ్యాగ్‌, రెండు కప్పుల వేడీ నీళ్లు.


తయారీ:తయారీ: ఎలక్ట్రిక్‌ టీ కెటిల్‌ లేదా టీ పాట్‌ లేదా నీళ్లు వేడిచేసుకునే గిన్నె రెడీగా పెట్టుకోవాలి. ఛాగా మష్రూమ్‌ క్యూబ్‌ని కాఫీ గ్రైండర్‌లో వేసి మెత్తటి పొడిలా చేయాలి. పొడికి బదులు ఛాగా టీ బ్యాగుని కూడా వాడొచ్చు. కానీ పొడితో చేసిన టీ వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయి. ఛాగా పొడిని టీ మేకర్‌ (టీ ఇన్‌ఫ్యూజర్‌) లో వేసి ఉడుకుతున్న నీళ్లల్లో దాన్ని ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఛాగా టీ బ్యాగ్స్‌ వాడేవాళ్లు నాలుగు నుంచి ఆరు నిమిషాలు వాటిని వేడినీళ్లల్లో ఉంచాలి. తర్వాత వేడి వేడి ఛాగా మష్రూమ్‌ టీని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-02-15T18:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising