ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంటీబాడీలు 8 నెలలు అలాగే..!

ABN, First Publish Date - 2021-05-15T16:13:06+05:30

మన రోగనిరోధక వ్యవస్థ కొన్ని అంటువ్యాధులను బాగా గుర్తుంచుకుంటుంది. కానీ కొన్నింటిని మర్చిపోతుంది. తట్టు కు ఇచ్చే టీకా ఆ వ్యాధిని తట్టుకునేలా జీవితకాలంపాటు రోగనిరోధక శక్తిని అందిస్తుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు రోగుల్లో రోజుల్లోనే క్షీణత

న్యూఢిల్లీ, మే 14: మన రోగనిరోధక వ్యవస్థ కొన్ని అంటువ్యాధులను బాగా గుర్తుంచుకుంటుంది. కానీ కొన్నింటిని మర్చిపోతుంది. తట్టు కు ఇచ్చే టీకా ఆ వ్యాధిని తట్టుకునేలా జీవితకాలంపాటు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కొన్ని ఫ్లూ వైర్‌సలకు అలాకాదు. వార్షిక టీకాలు అవసరం. ఎందుకంటే ప్రతిరోధకాలు రోగనిరోధక వ్యవస్థలో పరిమితకాలమే పనిచేస్తాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ప్రపంచమంతా వ్యాక్సిన్‌ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తద్వారా మానవాళి ఈ మహమ్మారిని అధిగమించవచ్చు. అయితే కరోనా బారినపడి కోలుకున్న వారిలో అభివృద్ధిచెందిన ప్రతిరోధకాలు ఎంతకాలం ఉంటాయి? రోజులా, నెలలా.. సంవత్సరాలా..? అనే ప్రశ్నల కు ఇటలీ శాస్త్రవేత్తలు సమాధానం ఇచ్చారు. రోగుల వయస్సు, అనారోగ్య తీవ్రత, ఇతర పా థాలజీలతో సంబంధం లేకుండా ప్రతిరోధకాలు ఉంటాయని మిలాన్‌లోని ఉన్న శాన్‌ రాఫెల్‌ ఆస్పత్రి తాజా నివేదికలో పేర్కొంది. కరోనా సోకిన రోగుల రక్తంలో యాంటీబాడీలు ఎనిమి ది నెలలపాటు ఉండిపోయినట్టు గుర్తించామని ఇటలీ పరిశోధకులు వెల్లడించారు.  


కొందరిలో రోజులు మాత్రమే..

కాగా.. వైర్‌సకు వ్యతిరేకంగా యాంటీబాడీ లు కొందరిలో కేవలం కొన్ని రోజులే కొనసాగుతాయనిమరొక అధ్యయనంలో వెల్లడైంది.  కొం తమందిలో ప్రతిరోధకాలు వేగంగా క్షీణిస్తాయి కాబట్టి వారికి వైరస్‌ తిరిగి సంక్రమించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated Date - 2021-05-15T16:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising