ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఈ సమస్య మొదలైంది.. ఎందుకు?

ABN, First Publish Date - 2021-11-03T19:49:45+05:30

నాకు కొవిడ్‌ వచ్చి తగ్గింది. కానీ స్కిన్‌ ఎలర్జీ మొదలైంది. ఏదైనా ఆహారంతో ఈ స్థితి నుంచి బయటపడవచ్చా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(03-11-2021)

ప్రశ్న: నాకు కొవిడ్‌ వచ్చి తగ్గింది. కానీ స్కిన్‌ ఎలర్జీ మొదలైంది. ఏదైనా ఆహారంతో ఈ స్థితి నుంచి బయటపడవచ్చా?


- రాజు, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: ఎలర్జీలకు ప్రత్యేకమైన డైట్‌ ఉండదు. మీకు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎలర్జీ లక్షణాలు కనిపిస్తున్నాయో ఆ పదార్థాల వాడకం మానెయ్యాలి. ఇలా తెలుసునేందుకు ఫుడ్‌ డైరీ రాయడం మంచి మార్గం. ఈ ఫుడ్‌ డైరీలో మీరు రోజూ ఏ ఆహార పదార్థాలు, ఎన్ని గంటలకు, ఎంత మొత్తంలో తీసుకుంటున్నారు, ఆ రోజుకు ఏవైనా ఎలర్జీ లక్షణాలు కనిపించాయా? లాంటి వివరాలు రాసుకోవాలి. ఈ విధంగా కనీసం ఓ వారం పదిరోజుల పాటు రాసుకుంటే మీకు ఇబ్బంది కలిగించే ఆహారాన్ని గుర్తించగలుగుతారు. వైద్యుల వద్దకు వెళ్ళినపుడు ఈ ఫుడ్‌ డైరీ తీసుకెళ్లి చూపించడం ద్వారా మీ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఎక్కువ. సాధారణంగా పాలు, గోధుమలు, కొన్ని రకాల కూరగాయలు, వేరుశెనగ, బాదం లాంటి గింజలు మొదలైన వాటికి ఎలెర్జీ ఉంటుంది. వీటికి కారణం ఫలానా ఆహార పదార్థం అని నిర్థారించకుండా అన్నీ మానెయ్యడం వల్ల పోషకాహార లోపాలు కూడా వస్తాయి. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-11-03T19:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising