ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 కె రన్‌... జాగ్రత్తలు ఎలా?

ABN, First Publish Date - 2021-10-08T17:12:05+05:30

మీరు ఐదు కిలోమీటర్ల పరుగులో పాల్గొనేందుకు కనీసం నెల ముందు నుంచి సాధన చేయాల్సి ఉంటుంది. సాధన లేదా శిక్షణ సమయంలో కూడా సరైన ఆహారం తీసుకుంటే పరుగు మీరు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. పరుగు లేదా ప్రాక్టీస్‌కు ముందు తేలికగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆంధ్రజ్యోతి(08-10-2021)

ప్రశ్న: అయిదు కిలోమీటర్ల పరుగులో పాల్గొందామనుకుంటున్నాను. ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


- కిరణ్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: మీరు ఐదు కిలోమీటర్ల పరుగులో పాల్గొనేందుకు కనీసం నెల ముందు నుంచి సాధన చేయాల్సి ఉంటుంది. సాధన లేదా శిక్షణ సమయంలో కూడా సరైన ఆహారం తీసుకుంటే పరుగు మీరు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. పరుగు లేదా ప్రాక్టీస్‌కు ముందు తేలికగా శక్తినిచ్చే అరటిపండు, యాపిల్‌, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష మొదలైనవి తీసుకుంటే పరుగెత్తేందుకు అవసరమైన గ్లూకోజు రక్తంలో ఏర్పడుతుంది. పరుగెత్తేటప్పుడు హైడ్రేషన్‌ (తగినంత నీరు తాగడం) కూడా చాలా ముఖ్యం. పరుగుకు అరగంట ముందే ఓ గ్లాసు నీటిని తాగినట్టయితే డీహైడ్రేషన్‌ సమస్య లేకుండా ఉంటుంది. పరుగు ముగించిన తరువాత మీరు చెమట ద్వారా కోల్పోయిన నీటిని, సోడియం, పొటాషియం లాంటి ఖనిజాలను ఆహారం ద్వారా త్వరగా తిరిగి పొందేందుకు ప్రయత్నించాలి. పరుగు ముగించిన వెంటనే నీరు, కొబ్బరి నీరు, ఉప్పు వేసిన నిమ్మరసం, మజ్జిగ మొదలైనవి తాగవచ్చు. తరువాత గంటలోపు కార్బోహైడ్రేట్స్‌, ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే పరుగు ద్వారా వచ్చిన అలసటను కూడా త్వరగా అధిగమించవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2021-10-08T17:12:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising