ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 2 వరకు ఆగు: అమిత్ షాకు మమత కౌంటర్

ABN, First Publish Date - 2021-03-29T00:40:06+05:30

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ మార్చి 27న జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ముగిసింది. కాగా, 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 26 గెలుస్తుందని అమిత్ షా ఆదివారం అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: 30 స్థానాల్లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన జోస్యంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమిత్ షా ఏమైనా ఈవీఎంలోకి దూరారా? 30 స్థానాలు బీజేపీనే గెలుస్తుందని ఎందుకు చెప్పడం లేదు అంటూ మండి పడ్డారు. ఎవరెన్ని స్థానాలు గెలుస్తారనేది లెక్కింపు తర్వాత తెలుస్తుందని, మే 2 వరకు బీజేపీ ఆగాలని ఆమె హితవు పలికారు.


బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ మార్చి 27న జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ ముగిసింది. కాగా, 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 26 గెలుస్తుందని అమిత్ షా ఆదివారం అన్నారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ‘‘మొదటి దశ పోలింగ్‌‌లోని మొత్తం 30 స్థానాల్లో 26 తామే గెలుస్తామని హోంమంత్రి అంటున్నారు. ఆయనేమైనా ఈవీఎం మిషన్‌లో దూరారా? ఎందుకు 30 సీట్లు బీజేపీనే గెలుస్తుందని చెప్పడం లేదు? ఫలితాలు వచ్చాక కదా ఎవరెన్ని గెలిశారని తెలిసేది? మే 2 వరకు ఆగండి’’ అని అన్నారు. దీనికి కొనసాగింపునిస్తూనే బయటివారెవరూ బెంగాల్‌ను పాలించరని, బెంగాల్‌లో టీఎంసీదే గెలుపని మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2021-03-29T00:40:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising