ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోబూచులాట: మమత, సువేంధు మధ్య తేలని ఆధిక్యం

ABN, First Publish Date - 2021-05-02T21:53:58+05:30

దోబూచులాట: మమత, సువేంధు మధ్య తేలని ఆధిక్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపు వైపు దూసుకుపోతోంది. కాగా, పార్టీ అభ్యర్థులు మెరుపు వేగంతో గెలుపు దిశగా అడుగులు వేస్తుంటే.. పార్టీ అధినేత మమతా బెనర్జీ మాత్రం గెలుపు-ఓటముల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. టీఎంసీ మాజీ నేత, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారిపై నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ బరిలోకి దిగారు. అయితే ఈ స్థానంలో మొదట సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగారు. అనంతరం మమతా ఆధిక్యంలోకి వచ్చారు. మరోసారి సువేందు ఆధిక్యంలోకి వచ్చారు. ఇక గెలుపు ఆయనదే అనుకునే లోపు మళ్లీ మమతా ఎక్కువ ఓట్లతో ముందంజలో నిలిచారు. ఇప్పటికి నందిగ్రామ్‌లో కౌంటింగ్ చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం మమతనే ముందంజలో ఉన్నారు. దీనికి తోడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా లెక్కించాల్సి ఉంది. ఈ కౌంటింగ్ కూడా పూర్తయ్యే వరకు ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Updated Date - 2021-05-02T21:53:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising