యానాం అభ్యర్థిగా రంగస్వామి
ABN, First Publish Date - 2021-03-18T06:47:23+05:30
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు
నామినేషన్ దాఖలు చేసిన మాజీ సీఎం
యానాం, మార్చి 17: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు తదితరులతో కలిసి ఆయన యానాంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. పుదుచ్చేరి ఎన్డీయే కూటమిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీ ఉన్నాయి. కాగా, యానాంలో స్వత్రంత అభ్యర్థిగా ఎన్.బురియ్య కూడా నామినేషన్ దాఖలు చేశారు.
Updated Date - 2021-03-18T06:47:23+05:30 IST