ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యం పండుగను సుసంపన్నం చేయండి : మోదీ

ABN, First Publish Date - 2021-04-29T18:29:14+05:30

ఎన్నికలను ప్రజాస్వామ్యం పండుగగా ప్రధాన మంత్రి నరేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎన్నికలను ప్రజాస్వామ్యం పండుగగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో ఎనిమిదో దశ పోలింగ్ గురువారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యం పండుగను సుసంపన్నం చేయాలని కోరారు. 


ఈ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 35 శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ జరుగుతోందని, కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్లు వేయాలని, ప్రజాస్వామ్యం పండుగను పరిపుష్టం చేయాలని పిలుపునిచ్చారు. 


పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు అమలవుతున్నాయి. గురువారం ఉదయం 11 గంటల వరకు 37.80 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. మొత్తం ఎనిమిది దశల్లో పోలైన ఓట్లను మే 2న లెక్కిస్తారు.


Updated Date - 2021-04-29T18:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising