ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్ షా రాజీనామా చేయాలంటూ ఎన్సీపీ డిమాండ్

ABN, First Publish Date - 2021-05-03T01:38:57+05:30

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నేషనలిస్ట్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం నేపథ్యంలో కేంద్ర హోమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయ పరీక్షకు ప్రజలు ఇచ్చే తీర్పే నిదర్శనమని ఆ పార్టీ పేర్కొంది. బెంగాల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కూడా ఎన్సీపీ గుర్తుచేసింది. ‘‘పశ్చిమ బెంగాల్లో హింస జరిగినప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలని మమత దీదీ కోరారు. అయితే ప్రజలు అడిగితేనే తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి ఎన్నికల తీర్పే కొలమానం. అది అమిత్ షాకి వ్యతిరేకంగా వచ్చింది. కాబట్టి అమిత్ షా.. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తున్నారు?’’ అంటూ ఎన్సీపీ అధికార ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు.


కాగా ఇవాళ సాయంత్రం 8:00 సమయానికి వెలువడిన ఫలితాల ప్రకారం... బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గానూ టీఎంసీ 195 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అన్నాడీఎంకే 62 స్థానాలు గెలుచుకుని మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరో రెండు చోట్ల ఇతరులు విజయం సాధించారు. 

Updated Date - 2021-05-03T01:38:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising